Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!
ABN , Publish Date - May 18 , 2024 | 04:26 AM
పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్‌కు విహార యాత్రకు వెళ్లారు.
కుటుంబంతో జగన్ లండన్‌కు
విమానం అద్దె గంటకు 12 లక్షలు!
నలుగురు భద్రతాధికారుల ఖర్చే కోటిన్నర
ఇక సీఎం కుటుంబం ఖర్చు ఎంతో?
31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాక
అమరావతి(ఆంధ్రజ్యోతి), గన్నవరం, మే 17: పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్‌కు విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మా త్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే! ఇది ప్రపంచంలోనే విలాసవంతమైనది. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500. నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్‌కు బయల్దేరారు.
YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?
సీఎం భద్రత కోసం నలుగురు అధికారులు ముందుగానే లండన్ వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి కోటిన్నర మాత్రమే. తరచూ పేదవాడినని చెప్పుకొనే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు కోటిన్నరను ప్రభుత్వమే భరించనుంది. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు. ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. జగన్ కుటుంబంతో కలసి తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి రాత్రి చేరుకున్నారు. జగన్‌కు మంత్రులు జోగి రమేశ్, కొట్టు సత్యనారాయణ తదితరులు వీడ్కోలు పలికారు.
పోలీసుల అదుపులో ఎన్నారై..
ఎన్నారై డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ బాబును గన్నవ రం పోలీసులు అదుపులో తీసుకున్నారు. సీఎం జగన్ ను అడ్డుకునేందుకు ఆయన విమానాశ్రయానికి వ చ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే శనివా రం రాత్రి ఢిల్లీ వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నానని, దాని ప్రింట్ కోసం విమానాశ్రయానికి వచ్చినట్టు లోకేశ్ బాబు తెలిపారు.