అన్నదాతా సుఖీభవ అమలు చేయాలి
ABN , Publish Date - Sep 03 , 2024 | 11:18 PM
అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
సీకేదిన్నె, సెప్టెంబరు 3: అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం కులుములపల్లెలో రైతు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనె 9, 10 తేదీల్లో గ్రామ సచివాలయాల్లో అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కోసం గ్రామ సచివాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైమూడు నెలలు గడిచిపోయిందని, ప్రభుత్వం ఇంతవరకు పెట్టుబడి సాయం అందించలేదన్నారు. వడ్డీవ్యాపారుల చుట్టూ రైతులు పెట్టుబడి సాయం కోసం తిరగాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణయ్య, కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, చిన్నసిద్దయ్య, శ్రీనివాసులరెడ్డి, రమణ, హరి, తదితరులు పాల్గొన్నారు.