ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Buddha Venkanna: టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు.. బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Jul 09 , 2024 | 06:16 PM

వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు.

Buddha Venkanna

అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఈ కుంభకోణంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని కోరానని అన్నారు. ఈ స్కాంకు సంబంధించిన వివరాలను డీజీపీకి అందజేసినట్లు వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ రెడ్డి రూ. 42వేల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. మళ్లీ జగన్ సీఎం అయ్యాక ఇసుక, గనులు, మద్యం, భూముల మీద దోపిడీ చేశారని మండిపడ్డారు. టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చిందని వివరించారు. ప్రభుత్వ స్థలం గజం రూ.2వేలు ఉన్న ప్రాంతంలో ఎకరాల చొప్పున వైసీపీ నేతలు కొనుగోలు చేశారని ఆరోపించారు. అక్కడ భూముల ధరలు పెంచే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. కుట్రతో గజం రూ. 2 వేలు ఉన్న చోట గజం రూ. 30వేలు పెంచారని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.


వేల కోట్ల రూపాయల కుంభకోణం

‘‘ప్రభుత్వానికి అవసరం లేకపోయినా.. ఆ భూములను కోనుగోలు చేసేలా బాండ్లు తీసుకున్నారు. ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం.. ప్రధాన పాత్రధారి జగన్. మాజీ సీఎం తన పేషీ నుంచి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి భూమి ధరలు పెంచేలా ఒత్తిడి తెచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ వచ్చాక ఈ బాగోతం బయట పడింది. జగన్ దోచుకున్న లక్షల కోట్లు కట్టించే వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాం. నేడు నిజాయతీగల డీజీపీ ఉన్నందున.. ఈ కుంభకోణం వివరాలు మొత్తం వివరించాను. ఏ విధంగా దోపిడీ చేశారు.. ఎవరెవరి పాత్ర ఎలా ఉందనే అంశాలను కూడా చెప్పాను. ఏ1 ముద్దాయిగా జగన్ చూపించి, సీఐడీతో విచారణ చేయించాలని కోరాను. డీజీపీ కూడా ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. టీడీఆర్ బాండ్ల విషయంలో జరిగిన అవకతవకలను పరిశీలించి సీఐడీకి కేసు అప్పగిస్తామని డీజీపీ చెప్పారు. జగన్ మోసాలు, అక్రమాలు బయట పెట్టేవరకు నా పోరాటం కొనసాగుతుంది’’ అని బుద్దా వెంకన్న తెలిపారు.


మార్కెట్ ధర పెంచి దోపిడీ చేశారు..

‘‘జగన్‌ను ముందు సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే.. అసలు విషయాలు బయటకు వస్తాయి. ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా నా పోరాటం చేస్తూనే ఉంటాను. అసలు స్థలం రేటు గతంలో ఎంత.. వైసీపీ నేతలు కొన్నాక ఎంత పెంచారు.. ఆ తర్వాత ఎలా చేతులు మారాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది. పాత్రధారులు, సూత్రధారులు ఎవరో విచారణలో మొత్తం బయటకు వస్తాయి. ఈ కుంభకోణం అల్లాఉద్దీన్ అద్భుత దీపంలా జగన్ చేశాడు. పేదల నుంచి తక్కువ ధరకు కొని.. 10 రెట్లకు ప్రభుత్వానికే అమ్ముకోవడం అంటే మాజీ సీఎం జగన్ పాత్ర లేకుండా జరిగే అవకాశమే లేదు. తిరుపతి, వైజాగ్, తాడేపల్లిగూడెంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇది జరిగింది.. నేను ఆప్రాంతాలకు కూడా వెళ్తా. వేల కోట్ల కుంభకోణం కాబట్టే... న్యాయం జరిగే వరకు నేను ఈ పోరాటం చేస్తా. అవసరం లేకపోయినా.. ఎందుకు పనికిరాకపోయినా.. తక్కువ ధరకు కొని.. మార్కెట్ ధర పెంచుకుని దోపిడీ చేశారు. జగన్ చేసిన కుంభకోణాలన్నీ పైకి కనిపిస్తాయి.. ఈ కుంభకోణం మాత్రం ఎవరికీ కనిపించకుండా చేశారు. మళ్లీ తానే అధికారంలోకి వస్తానని అడ్డగోలుగా చేశారు.. ఇప్పుడు ఆయనే ముందు జైలుకు వెళ్తాడు’’ అని బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 09 , 2024 | 06:27 PM

Advertising
Advertising
<