Share News

AP News: రాజధానికి ఓ రూపు తెచ్చే పనిలో చంద్రబాబు సర్కార్..

ABN , Publish Date - Jun 23 , 2024 | 01:52 PM

అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి ఓ రూపు తెచ్చే దశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. రాజధాని పనుల పునర్ః నిర్మాణంతో పాటు కేంద్ర సంస్థలను రాజధానికి రప్పించేందుకు చర్యలు చేపడుతోంది. 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

AP News: రాజధానికి ఓ రూపు తెచ్చే పనిలో చంద్రబాబు సర్కార్..

అమరావతి: ఏపీ రాజధాని (AP Capital) అమరావతికి (Amaravati) ఓ రూపు తెచ్చే దశగా చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt.) అడుగులు (Steps) వేస్తోంది. రాజధాని పనుల పునర్ః నిర్మాణంతో పాటు కేంద్ర సంస్థలను (Central institutions) రాజధానికి రప్పించేందుకు చర్యలు చేపడుతోంది. 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో వారి ఆలోచనలను, ప్రణాళికలను చెప్పాలంటూ సీఆర్డీఏ అధికారులు (CRDA officials) ఫోన్లు చేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో తమను ఎవ్వరూ సంప్రదించ లేదని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. కొన్ని సంస్థలు అయితే తమకు కేటాయించిన స్థలం చూపెట్టాలంటున్నారు.


నాటి తెలుగుదేశం (TDP) హయాంలో 10-15 కేంద్ర సంస్థలకు.. జాతీయ బ్యాంకులకు రాజధానిలో భూములు కేటాయించారు. అప్పుడు టీడీపీ హయాంలో భూ కేటాయింపులు జరిపిన సంస్థల వివరాలు.... కాగ్ (Cog), ఆర్బీఐ (RBI), సీబీఐ (CBI), ఎఫ్‌సీఐ (FCI), సీపీడబ్ల్యూడీ (CPWD), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (Department of Posts), నిఫ్ట్ (Nifty), ఎన్ఐడీ (NID), టూల్ డిజైన్ (Tool Design). నాబార్డ్ (NABARD), ఎస్‌బీఐ (SBI), యూనియన్ బ్యాంక్ (Union Bank), కెనరా బ్యాంక్ (Canara Bank), ఎల్ఐసీ (LIC), ఇండియన్ ఆయిల్ (Indian Oil), హెచ్‌పీసీఎల్ (HPCL), గెయిల్ (Gail) తదితర సంస్థలకు భూములు కేటాయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమెరికాలో కాల్పులు.. బాపట్ల జిల్లా యువకుడి మృతి

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..

8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం

రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 23 , 2024 | 01:53 PM