YSRCP: బైరెడ్డి సొంత నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్
ABN , Publish Date - Feb 13 , 2024 | 01:38 PM
Andhrapradesh: నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్ తిగింది. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య వైసీపీకి రాజీనామా చేశారు.
నంద్యాల, ఫిబ్రవరి 13: నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్ తిగింది. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘నా మిత్రుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌కు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరం. సర్వే రిపోర్ట్‌లు బాగున్నా ఆర్ధర్‌కు టికెట్ నిరాకరించారు. జగన్ దళిత ఎమ్మెల్యేలకు టికెట్‌లు కట్ చేసి వారికి తీరని ద్రోహం చేశారు. బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని నేనే వైసీపీలో చేర్చాను. కానీ నాకు పార్టీలో సరైన గుర్తింపు లేదు. ఇక నుంచి ఎమ్మెల్యే ఆర్థర్‌తో కలసి నడవను. టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉండొచ్చు’’ అంటూ చెరకుచెర్ల రాఘురామయ్య వ్యాఖ్యలు చేశారు.