Nadendla Manohar : రేషన్‌ మాఫియాపైసీఐడీ విచారణ | Minister Nadendla Manohar Announces Crackdown on Rice Smuggling from Kakinada Port
Share News

Nadendla Manohar : రేషన్‌ మాఫియాపైసీఐడీ విచారణ

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:46 AM

కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళుతున్న స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Nadendla Manohar : రేషన్‌ మాఫియాపైసీఐడీ విచారణ

  • ‘బియ్యం’ అక్రమ రవాణాపై ఉక్కుపాదం

  • ఇప్పటివరకు 1066 కేసులు: నాదెండ్ల

విశాఖపట్నం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళుతున్న స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన తనిఖీల తరువాతే కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై స్పష్టత వచ్చింది. సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో గడిచిన మూడేళ్లలో 1.31లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేశారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ డెన్‌గా మార్చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపుతు న్నాం. నిబందనలు అతిక్రమించిన వారిపై ఇప్పటి వరకూ 1066 కేసులు నమోదుచేసి, 729 మందిని అరెస్టు చేశాం. 62 వేల టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేశాం’ అని మంత్రి నాదెండ్ల వివరించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Dec 06 , 2024 | 04:46 AM