Venkaiah Naidu: 'గ్రామాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కొత్త మార్గాలు వెతకాలి'
ABN , Publish Date - Jan 09 , 2025 | 08:42 PM
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) ఉన్నత్ భారత్ అభియాన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో “భారతదేశాన్ని అభివృద్ధి చేయడం, గ్రామీణ యువతను సాధికారత చేయడం” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ నేపథ్యంలో హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కీలక ప్రసంగం చేశారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) 2025లో "భారతదేశాన్ని అభివృద్ధి చేయడం, గ్రామీణ యువతను సాధికారత చేయడం" అనే అంశంపై రెండు రోజుల (జనవరి 8, 9) జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత్ భారత్ అభియాన్ సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమం గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, సమాజ అభివృద్ధి కోసం అవసరమైన నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రజల సంపద, జ్ఞానం..
ఈ టెక్నికల్ సెషన్ తరువాత రెండో రోజు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) "డెవలప్డ్ ఇండియా@2047, వాయిస్ ఆఫ్ యూత్" పేరుతో ప్రత్యేక ప్రసంగం చేశారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం నూతన మార్గాలను వెతకాలని సూచించారు. భారతదేశ అభివృద్ధి 143 కోట్ల మంది పౌరులకు, ముఖ్యంగా బలహీనవర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని అన్నారు. ఆయన ఉద్ఘాటించిన ముఖ్యమైన అంశం "మన ప్రజల సంపద, జ్ఞానం, ఆనందాన్ని మనం పెంచాలి".
వలసలు కట్టడి చేయాలి..
భారతదేశం మన మాతృభూమి అని, దానిని కాపాడుకోవాలనే అభిరుచి మనకు ఉండాలన్నారు. ఆవిష్కరణలు సమర్థమైనవై, అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పరిష్కారాలను వెతకాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు విద్యార్థులకు సూచించారు. భారతదేశం గొప్ప కళాత్మక వారసత్వాన్ని కల్గి ఉందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని వెంకయ్య కోరారు. సంస్కరణల పనితీరు పరివర్తనపై ప్రధానమంత్రిగారు ఇచ్చిన మంత్రమైన "మనమే మార్పు తీసుకురావాలి, ప్రజలకు న్యాయం జరుగుతుందనే దిశలో సాగాలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూడడం అవసరమని ఆయన వెల్లడించారు.
సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి..
సదస్సు రెండో (జనవరి 9న) రోజు టెక్నికల్ సెషన్లో డాక్టర్ ఆర్. రమేష్ రెంగసామి, UBA-SEG, NIRDPR, హైదరాబాద్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్, పౌర రంగాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడంలో ఆవిష్కరణల కీలక పాత్రను వివరిస్తూ ప్రసంగం చేశారు. ఆయన ఆవిష్కరణ, సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి వ్యాపార నమూనాలతో వాటి సంబంధాన్ని వివరించారు.
అట్టడుగు స్థాయి అభివృద్ధి
ప్రొ. పి.కె. సింగ్ ఉన్నత్ భారత్ అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, దీని ఆవిర్భావం, దృష్టి, లక్ష్యాలను వివరించారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనిటీ అభివృద్ధి, అట్టడుగు స్థాయి అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
ఉన్నత్ భారత్ అభియాన్
హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. బి. జె. రావు మాట్లాడుతూ ఉన్నత్ భారత్ అభియాన్ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. గ్రామీణ భారతదేశానికి విజ్ఞానం, నిధులు తీసుకెళ్లడంలో ఈ ప్రాజెక్ట్ పాత్రను ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి...
KTR ACB: కేటీఆర్‌పై ముగిసిన ఏసీబీ విచారణ.. ఆరున్నర గంటలపాటు
KTR: అవసరమైతే చచ్చిపోతా.. కేటీఆర్ సంచలన కామెంట్స్
Supreme Court: సుప్రీంలో కేటీఆర్‌కు దక్కని ఊరట
Read Latest Telangana News And Telugu news