Share News

Mukkoti Ekadashi 2025: ముక్కోటి ఏకాదశి రోజు.. ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..?

ABN , Publish Date - Jan 09 , 2025 | 09:07 PM

Mukkoti Ekadashi 2025: అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు.. ఆ దేవదేవుడిని ఉత్తర ద్వారంలో నుంచి వెళ్లి దర్శించుకోంటే.. సద్గతులు సంప్రాప్తిస్తాయని అంటారు. అలాంటి పవిత్రమైన రోజు.. ఏం జపించాలి.. ఏం ఉచ్చరించకోడదంటే..

Mukkoti Ekadashi 2025: ముక్కోటి ఏకాదశి రోజు.. ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..?

Mukkoti Ekadashi 2025: ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులున్నా... వాటిలో పవిత్రమైన రోజులు కొన్ని మాత్రమే. వాటిలో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో కానీ.. పుష్య మాసంలో కానీ.. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అంటే.. 2025, జనవరి 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి జరుపుకొనున్నారు.

ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటంటే.. శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై.. మూక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


ఈ రోజు.. పూజకు ముహూర్తం

ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుకోవాలి.Venkanna-01.jpg


Venkanna-12.jpgఉత్తర ద్వార దర్శనంతో స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో బ్రహ్మి ముహూర్తంలో శ్రీ లక్ష్మీ నారాయణులను యథాశక్తితో పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇక ఆలయాలలో శ్రీ విష్ణువునకు తులసి మాలలను భక్తిశ్రద్దలతో సమర్పించాల్సి ఉంటుంది.


Venkanna11.jpg

ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల ముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు సాయంకాలం సంధ్యా సమయంలో పూజ చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. జాగారం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కధలు, హరికథా కాలక్షేపంతో జాగరణ చేస్తే.. సంపూర్ణ ఫలం దక్కుతుందని పేర్కొంటున్నారు.


ఏకాదశిలోని నిగూఢ తత్వం..

ఏకాదశి అంటే 11. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. ఏకాదశి ఉపవాసం రోజు ఈ పదకొండిటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షను చేయడమే ఈ వ్రతం యొక్క అంతరార్థమని శాస్త్ర పండితులు చెబుతున్నారు.


ముక్కోటి ఏకాదశి వ్రతం నియమ నిష్ఠలతో ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. అలాగే భగవత్ తత్వం బోధపడుతుంది. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు నిష్ఠగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మామూలు రోజుల్లో కన్నా కోటి రెట్లు ఫలితం అధికంగా ఉంటుందని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు చేపట్టిన ఉపవాస దీక్ష.. ఆ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచిగా పూజా కార్యక్రమం ముగించుకొవాలి. అనంతరం ఓ సద్భ్రాహ్మణునికి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకుని భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఉపవాసాన్ని విరమించాలి.


ఈ రోజు ఉపవాసం చేసి.. హరి నామ స్మరణ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్య ఫలం లభిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఈ రోజు.. విష్ణు సహస్రనామాన్ని చదివినా.. విన్నా... ఎన్నో జన్మల పుణ్యం సంప్రాప్తిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఈ సహస్ర నామాలు చేయలేని వారు.. విష్ణు నామస్మరణ చేసినా చాలు ఆయన కరుణిస్తాడని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ రోజు.. శాంతంగా.. భక్తి శ్రద్ధలతో ఏం చేసినా పుణ్య ప్రదమేనని అంటున్నారు. ఈ రోజు మాత్రం పరులను దూషించడం కానీ.. పరుష పదాలు ఉచ్చరించడం కానీ చేయకుండా ఉంటే మంచిదని శాస్త్ర పండితులు సెలవిస్తున్నారు.

మరిన్నీ ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 09 , 2025 | 09:11 PM