Share News

Chandrababu live Updates: తొలి ఫైల్‌పై సంతకం చేసిన సీఎం చంద్రబాబు

ABN , First Publish Date - Jun 13 , 2024 | 04:53 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించగా.. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేడు (గురువారం) బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, దీవెనలతో తన ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

Chandrababu live Updates: తొలి ఫైల్‌పై సంతకం చేసిన సీఎం చంద్రబాబు

Live News & Update

  • 2024-06-13T18:15:08+05:30

    • చంద్రబాబు ,పవన్ కల్యాణ్ చిత్ర పాఠాలకు పాలాభిషేకం

    • సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్ర పాఠాలకు డీఎస్సీ అభ్యర్థుల పాలాభిషేకం

    • చంద్రబాబు మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేయటంతో రాజాంలో సంబరాలు

    • థాంక్యూ సీఎం సార్ అంటూ డీఎస్సీ అభ్యర్థుల నినాదాలు

  • 2024-06-13T17:49:44+05:30

    • చంద్రబాబును కలిసేందుకు క్యూకట్టిన ఐఏఎస్, ఐపీఎస్‌లు

  • 2024-06-13T17:33:20+05:30

    సీఎం చంద్రబాబుకు తొలి ఫిర్యాదు చేసిన ఓ రైతు

    తన భూమిని వైసీపీ రౌడీలు వచ్చి ఆక్రమించుకొని తనపైనే దాడి చేశారంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓ రైతు ఫిర్యాదు చేశారు. స్పందించిన చంద్రబాబు.. అందుకనే భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేశామని బదులిచ్చారు. ఈ రోజు నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉండబోదని రైతుకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

  • 2024-06-13T17:25:08+05:30

    • సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆయన వెంట ఉన్న మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్

  • 2024-06-13T17:19:22+05:30

    • ఉద్యోగాల కల్పనకు శిక్షణ అవసరమని భావిస్తోన్న ప్రభుత్వం

    • స్వయం ఉపాధి కి కూడా తప్పనిసరిగా శిక్షణ అవసరం

    • గతంలో చాలా సార్లు చెప్పిన పవన్ కల్యాణ్

    • అన్నయ్య తనకు తొలిసారి సినిమా అవకాశం కల్పించారు. రెండు మూడు సినిమాలు ఫెయిల్ కావడంతో శిక్షణ తీసుకున్నానని గతంలో చెప్పిన పవన్

    • అలానే ఎవరైనా శిక్షణ తీసుకుంటే బాగా తయారు అవుతారన్న పవన్

    • నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయనున్న టీడీపీ ప్రభుత్వం

  • 2024-06-13T17:09:51+05:30

    • ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు సచివాలయానికి క్యూ..

    • ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు ఇప్పుడు సచివాలయానికి క్యూకట్టారు. సీఎంను కలిసి విషెస్ చెప్పేందుకు మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు వచ్చారు. అయితే గతంలోనే ఆయన చంద్రబాబు నివాసానికి వచ్చినా ఆయనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ దక్కలేదు.

    • సచివాలయానికి చేరుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ రాజాబాబు

  • 2024-06-13T17:00:24+05:30

    • అన్నా క్యాంటీన్లు ఏర్పాటుపై నాలుగవ సంతకం

    • నైపుణ్య గణనపై ఐదవ సంతకం

      నైపుణ్య గణాంకాలను వెంటనే చేపడతారు. ప్రపంచంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే అంశాలపై అధ్యయనం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నించారు. దీని ద్వారా కావాల్సిన స్కిల్స్ ఏమిటో తెలుసుకొని యువతకు నేర్పిస్తారు. ఇందుకోసం మానవ వనరులు తయారీకి సంబంధించిన కార్యక్రమం చేపడతారు.

  • 2024-06-13T16:58:53+05:30

    Untitled-8.jpg

    • మొత్తం 5 ఫైల్స్‌పై చంద్రబాబు సంతకం చేశారు

    • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం

    • నెలకు రూ.4 వేల పెన్షన్‌పై మూడవ సంతకం

    • జులైలో మాత్రం గత మూడు నెలలకు కలిపి రూ.3 వేలు, జులై నెల పెన్షన్ రూ.4 వేలు మొత్తం కలిపి రూ.7 వేలు అందజేస్తారు

  • 2024-06-13T16:54:18+05:30

    • ముఖ్యమంత్రిగా మెగా డీఎస్సీపై సంతకం చేసిన నారా చంద్రబాబు నాయుడు

    • 16,347 పోస్టులతో కూడిన డీఎస్పీ నోటిఫికేషన్‌పై ఈ సంతకం చేశారు

  • 2024-06-13T16:52:45+05:30

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించగా.. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేడు (గురువారం) బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, దీవెనలతో తన ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దారి పొడవునా భారీ స్వాగతాలతో సచివాలయానికి చేరుకున్న ఆయన అధికారిక ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు.

    అంతకుముందు సచివాలయానికి వెళ్తున్న సమయంలో రాజధాని రైతులు, ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా భారీగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీ స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూల స్వాగతం పలికారు. జై చంద్రబాబు.. జైజై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనపై పూలు చల్లారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.