Share News

Renigunta: స్పెషల్‌ ఫ్లైట్లతో కిటకిటలాడిన ఎయిర్‌పోర్ట్‌

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:40 PM

తిరుపతి(Tirupati)లో జరిగిన పెను విషాదం, వైకుంఠ ఏకాదశి పర్వదినం వెరసి వీఐపీల తాకిడితో విమానాశ్రయం గురువారం కిటకిటలాడింది. బాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాజీ సీఎం జగన్‌ వేర్వేరుగా తిరుపతి పర్యటనకు వచ్చారు.

Renigunta: స్పెషల్‌ ఫ్లైట్లతో కిటకిటలాడిన ఎయిర్‌పోర్ట్‌

రేణిగుంట(తిరుపతి): తిరుపతి(Tirupati)లో జరిగిన పెను విషాదం, వైకుంఠ ఏకాదశి పర్వదినం వెరసి వీఐపీల తాకిడితో విమానాశ్రయం గురువారం కిటకిటలాడింది. బాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Chief Minister Nara Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan), మాజీ సీఎం జగన్‌ వేర్వేరుగా తిరుపతి పర్యటనకు వచ్చారు. సీఎం మధ్యాహ్నం 1.20గంటలకు వచ్చి రాత్రి ఎనిమిది గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ వార్తను కూడా చదవండి: Bhumana: ఇది ముమ్మాటికి టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే..


డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మధ్యాహ్నం 3.30గంటలకు వచ్చి రాత్రి 8.25గంటలకు బయల్దేరారు. మాజీ సీఎం జగన్‌ సాయంత్రం 5.30 గంటలకు ఇక్కడకు చేరుకున్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో వచ్చారు. మరోవైపు తిరుమలేశుడి వైకుంఠ ద్వార దర్శనం కోసం కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు కూడా విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30గంటలకు వచ్చారు. తర్వాత తిరుచానూరు(Thiruchanur)లో జరిగే ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్లారు.


nani6.2.jpg

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణం రాజు ఇండిగో విమానంలో కుటుంబీకులతో కలిసి మధ్యాహ్నం 1.10గంటలకు వచ్చారు. తర్వాత తిరుమలకు బయల్దేరి వెళ్లారు. హర్యానా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ.. ఇండిగో విమానంలో ఉదయం 10.50గంటలకు వచ్చారు. తిరుపతి, రాజంపేట(Tirupati, Rajampet)లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, 11వ తేదీన శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి.. ఇండిగో విమానంలో సాయంత్రం 4 గంటలకు వచ్చారు.


తర్వాత రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెల్లవారు జామున 4.55 గంటలకు విమానాశ్రయం చేరుకుని, తిరుమలకు వెళ్లారు. అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తిరుమలేశుడి దర్శనార్థం విశాఖపట్నం(Visakhapatnam) నుంచి వచ్చారు. ఇలా వచ్చిన వీఐపీలతోపాటు వారికి స్వాగతం పలకడానికి వచ్చిన వారితో తిరుపతి విమానాశ్రయం కిక్కిసింది. ఇక శుక్రవారంనుంచి వైకుంఠ ద్వార దర్శనం కోసం వివిధ రాష్ర్టాల నుంచి పలువురు ప్రముఖులు రానున్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 12:40 PM