Share News

MLA: భూమనా.. శవ రాజకీయాలు మానుకో

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:46 AM

వైకుంఠ ద్వార దర్శన టికెట్స్‌ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(MLA Arani Srinivasulu) అన్నారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్‌ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం పరామర్శించారు.

MLA: భూమనా.. శవ రాజకీయాలు మానుకో

- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతి: వైకుంఠ ద్వార దర్శన టికెట్స్‌ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(MLA Arani Srinivasulu) అన్నారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్‌ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ భక్తుల మనోభావాలను కించపరిచేలా మాజీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్న సంగతి ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: iPhone: హుండీలో జారిపడ్డ ఐఫోన్‌.. రూ.10వేలకు దక్కించుకున్న సొంతదారు


nani4.2.jpg

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(CM Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan)లను విమర్శించే స్థాయి కరుణాకరరెడ్డికి లేదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, జనసేన నాయకులు కిరణ్‌ రాయల్‌, రాజారెడ్డి, బీజేపీ నేతలు భానుప్రకాష్‌ రెడ్డి, సామంచి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 11:50 AM