Share News

Kakani: అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం.. కాకాణి దౌర్జన్యం

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:18 AM

Kakani Govardhan: పోలీసులపై, రెవెన్యూ సిబ్బందిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

Kakani: అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం.. కాకాణి దౌర్జన్యం
Former Minister Kakani Goverdhan Reddy

నెల్లూరు, డిసెంబర్ 25: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ మహిళపై అత్యాచారం కేసులో తన ముఖ్య అనుచురుడిపై కేసు పెట్టారంటూ కాకాణి బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు. ఏకంగా పోలీసు, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తూ మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాకాణి ముఖ్య అనుచురుడు వెంకటశేషయ్యపై లైంగిక దాడి కేసు నమోదు అయ్యింది. ఓ మహిళ ఫిర్యాదుతో వెంకటశేషయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక లైన్‌మెన్ చనిపోతే భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చాలా కాలంగా మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఉద్యగం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా నడుచుకున్నారని, లైంగిక వేధింపులు కొనసాగించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వెంకటశేషయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు కూడా తరలించారు.


అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కాకాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై, రెవెన్యూ సిబ్బందిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. జగన్ సీఎం కాకూడదని, తాను గెలవకూడదని సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవి ప్రతిరోజూ దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని అంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు.

Formula E race: ఫార్ములా ఈరేస్ కేసులో కీలక పరిణామం


తాము అధికారంలోకి వస్తే ఖాకీ దుస్తులు ఊడదీసి పసుపు దుస్తులు ధరించి చంద్రబాబు, లోకేష్ వెంట, టీడీపీ నేతలు వెనుక తిరగాల్సిందేనంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. సీఐ, ఆర్‌ఐలు శాశ్వతంగా విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ఏకంగా పోలీసులనే ఈ తరహాలో కాకాణి బెదిరిండం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

Allu Arjun: తప్పయిపోయింది!

ACB Files : సంజయ్‌పై ఏసీబీ కేసు

Read latest AP News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 11:39 AM