ఈవీఎంల గోదాము తనిఖీ
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:38 PM
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదామును కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు.

పాడేరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదామును కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. భద్రత, తదితర అంశాలను పరిశీలించి, అవసరమైన వివరాలను డీఆర్‌వో పద్మలతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.