గోదావరిని ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:30 PM
కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిని ఎండబెడుతోందని, ప్రజలు తీ వ్రంగా వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేస్తున్నారని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పాదయాత్రలో రెండో రోజులో భాగంగా మంగళవారం పెద్దపల్లిలో కొనసాగింది. బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

పెద్దపల్లిటౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిని ఎండబెడుతోందని, ప్రజలు తీ వ్రంగా వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేస్తున్నారని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పాదయాత్రలో రెండో రోజులో భాగంగా మంగళవారం పెద్దపల్లిలో కొనసాగింది. బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. చందర్ మాట్లాడు తూ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ సాగునీటి వరప్రదా యిని కాళేశ్వరం ప్రాజె క్టును ఎండబెట్టి రైతులను అరి గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి గోసను ప్రజలకు వివరించేందుకు పాద యాత్ర చేపట్టినట్లు తెలి పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిన గోదావరితో రైతన్నల కన్నీళ్లు, కష్టాలను చూసి చలించిన కేసీఆర్ కాళేశ్వ రం ప్రాజెక్టుతో కన్నీళ్లను తుడిస్తే కాంగ్రెస్ ప్రభు త్వం కేసీఆర్‌పై అక్క సుతో కాళేశ్వరం కూలిందని గోదావరిని ఎండబెట్టిందని విమర్శించారు. రైతులు పం ట పొలాలు ఎండుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశా రు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, ఎడారిగా మారిన విధానాన్ని ప్రజ లకు వివరించే విధంగా 180 కిలోమీటర్ల యాత్ర సాగుతుందన్నారు. గంట రాము లు, రఘువీర్ సింగ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్, రాజేష్, దాసరి ఉష, లైసెట్టి భిక్షపతి, పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ చేపట్టిన పాదయాత్ర పెద్దకల్వల గ్రామా నికి చేరుకోగా సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు సలేం ద్ర కొమురయ్య వారికి స్వాగతం పలికారు. కోరుకంటి చందర్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవిందర్ లను సన్మానించారు. నాయకులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిండుకుండలా ఉన్న గోదావరిని కాం గ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చం దర్ అన్నారు. చందర్ పాదయాత్రకు బీఆర్‌ఎస్ నాయ కులు స్వాగతం పలికి సన్మానించారు. తెలంగాణ చౌర స్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి చందర్ పూలమాల వేసి నివాళు లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ గొప్పత నాన్ని, గోదావరిని ఎండ బెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడా నికి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపట్టానన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసు తో కాళేశ్వరాన్ని వదిలేశారని గోదావరిని ఎండబెట్టారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 365 రోజులూ గోదా వరి నిండు కుండలా ఉందని, పడవ పోటీలు నిర్వ హించామన్నారు. గోదావరి ఎండ బెట్టడంతో పది రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని, సాగు నీటికి కటకట ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నా రన్నారు. మాజీ ఎంపీపీలు బాలాజీ రావు, పాల రామారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మ న్ బుర్ర శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సం దీప్‌రావు, సూర శ్యామ్, పట్టణ అధ్యక్షుడు పారుపల్లి గుణపతి, కూకట్ల గోపి, సాజిద్, గుర్రాల శ్రీను, పాల్గొన్నారు.