Share News

Elephants మళ్లీ వసప తోటలకు ఏనుగులు

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:37 PM

Elephants గడచిన వారం రోజులుగా ఏనుగుల సంచా రంతో కంటి మీద కునుకు లేకుండా ఉందని వసప, కుంటిభద్ర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Elephants   మళ్లీ వసప తోటలకు ఏనుగులు
వసప పంట పొలాల్లో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు

కంటిమీద కునుకులేదని గ్రామస్థుల ఆవేదన

కొత్తూరు, మార్చి 18(ఆంధ్ర జ్యోతి): గడచిన వారం రోజులుగా ఏనుగుల సంచా రంతో కంటి మీద కునుకు లేకుండా ఉందని వసప, కుంటిభద్ర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కుంటిభద్ర తోటల్లో తిష్ఠ వేసిన ఏనుగులు మంగళవారం ఉదయం రెండు ఏనుగులు కుంటిభద్ర తోటల్లో సంచరించగా మరో రెండు కడుము తోటల్లో చెట్ల కింద సేదతీరాయి. దీంతో తోటలకు వెళ్లిన రైతులు ఏనుగులను చూసి పరుగులు తీశారు. సాయంత్రానికి నాలుగు ఏనుగులు వసప తోటలకు చేరాయి. దీంతో పంటల నష్టం అంచనా వేసేందుకు అటవీశాఖాధి కారులు వెళ్లలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు ఏవైపు నుంచి వచ్చి పంటలను ధ్వంసం చేస్తాయోనని వాపోతున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:37 PM