Share News

విద్యుదాఘాతంతో గిరిజనుడి మృతి

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:36 PM

మేకలకు మేత కోసం చెట్టు కొమ్మలను నరుకుతున్న ఓ గిరిజనుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో గిరిజనుడి మృతి
చెట్టుపైమంగలన్న మృతదేహం

అరకులోయ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మేకలకు మేత కోసం చెట్టు కొమ్మలను నరుకుతున్న ఓ గిరిజనుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని పద్మాపురం పంచాయతీ పరిధి కొత్తకిల్లోగుడ గ్రామానికి చెందిన కొర్ర మంగలన్న(55) మంగళవారం మధ్యాహ్నం మేకలను మేత కోసం గ్రామ సమీపంలోకి తీసుకువెళ్లాడు. చెట్టు ఎక్కి కొమ్మలను కత్తితో నరుకుతుండగా విద్యుత్‌ తీగలకు కత్తి తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Updated Date - Mar 18 , 2025 | 11:36 PM