మిరియాలకు మంచి ధర
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:37 PM
మండల కేంద్రంలో మంగళవారం జరిగిన వారపు సంతలో మిరియాలకు మంచి ధర పలికింది. పూర్తిగా గ్రేడింగ్ చేసి బాగా ముదిరిన మిరియాలను రైతులు కిలో రూ.590 చొప్పున విక్రయించారు.

వారపు సంతలో కిలో రూ.590కి విక్రయం
రైతుల్లో ఆనందం
జి.మాడుగుల, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం జరిగిన వారపు సంతలో మిరియాలకు మంచి ధర పలికింది. పూర్తిగా గ్రేడింగ్ చేసి బాగా ముదిరిన మిరియాలను రైతులు కిలో రూ.590 చొప్పున విక్రయించారు. గత వారం అయితే కిలో రూ.560 నుంచి రూ.570 మధ్య ధర పలికింది. ఈ వారం కిలో రూ.590కి అమ్ముడుపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా పసుపు ధర మాత్రం తగ్గుతూ వస్తోంది. ప్రారంభ దశలో కిలో రూ.136 ధర లభించగా, గత మూడు వారాలుగా తగ్గుతోంది. తాజాగా మంగళవారం వారపు సంతలో కిలో రూ.112 నుంచి రూ.115 మధ్య ధర పలికింది. ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే జీసీసీ కిలో పసుపు రూ.100కు కొనుగోలు చేస్తోంది. కాగా జీసీసీ చింతపండు కొనుగోలు ధర కిలో రూ.36 చొప్పున ప్రకటించిన విషయం తెలియక గిరిజనులు మంగళవారం వారపు సంతలో కిలో చింతపండు రూ.30లు చొప్పున విక్రయించారు. జీసీసీ అధికారులు ధర విషయంలో అవగాహన కల్పించడం లేదని గిరిజనులు వాపోయారు.