TDP: జగన్ వ్యాఖ్యలపై శ్రీనివాసులు రెడ్డి కౌంటర్..
ABN , Publish Date - Jul 04 , 2024 | 02:06 PM
నెల్లూరు జిల్లా: ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కలిశారు. సుమారు అరగంటకుపైగా ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన బయటికొచ్చి..
నెల్లూరు జిల్లా: ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైల్లో (Nellore Central Jail) ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) గురువారం కలిశారు. సుమారు అరగంటకుపైగా ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన బయటికొచ్చి మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ అధికారం పోయిన ప్రెస్టేషన్‌లోనే నెల్లూరు జైల్ దగ్గర అలా మాట్లాడారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పిన్నెల్లిపై కేసులు నమోదు అయ్యాయని, చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే ఎన్నికల సంఘం పిన్నెల్లిపై కేసులు పెట్టిందన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం పోయి... ఇప్పుడు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుందన్నారు. జగన్ ప్రజలకు మొహం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు మొహం చూపిస్తున్నారన్నారు. పిన్నెల్లి ఏమైనా గాంధీ మహాత్ముడా.. చంద్రబాబును హెచ్చరించే అర్హత జగన్‌కు లేదని శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
కాగా నెల్లూరు సెంట్రల్ జైలు బయట జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నది జగనేనా..? అంటూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. పిన్నెల్లిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీకి ఓటేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో స్వయంగా ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జిల్లా కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. ఇక కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ రేంజిలో హెచ్చరించిందో అందరికీ తెలిసిందే. కానీ జగన్ మాత్రం అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ కార్యాలయాల జోలికి వస్తే ఖబడ్దార్..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల (ఫోటో గ్యాలరీ)
ఆకాశమే హద్దుగా.. అమరావతి: సీఎం చంద్రబాబు
మోదీతో టీ20 వరల్డ్ కప్ విజేతల భేటీ నేడు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News