Worlds most Expensive Mango: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కిలో రూ.3 లక్షలు
ABN , Publish Date - Mar 22 , 2025 | 07:42 AM
జపాన్‌కు చెందిన ఎగ్ ఆఫ్ ది సన్ అనే మామిడి పండు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరు పడింది. జపాన్ వాతావరణ పరిస్థితులకు అనుగూణంగా ఈ హైబ్రీడ్‌ను రూపొందించారు. ప్రత్యేకమైన తియ్యదనం, నువాసన కలిగిన ఈ పండు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: మామిడి పండ్ల ధరలు ఎంత ఉంటాయి అంటే ఏ వందో ఉంటాయని చెబుతాము. కానీ కిలో రూ.3 లక్షల ధర పలికే మామిడి పండ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరు పడ్డ ఈ మామిడి పండు జపాన్‌లో పుట్టింది. దీన్ని మియాజాకీ మామిడి అని అంటారు. అత్యద్భుతమైన రుచి, రంగు కారణంగా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి ఈ పండు విశిష్టతలు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం (worlds most expensive mango egg of the sun).
ఈ మామిడి పండుకు ఎగ్ ఆఫ్ ద సన్ అని పేరు. అంటే సూర్యుడిని గుర్తుకు తెచ్చేలా ఎరుపు వర్ణంలో ఉంటుంది. 1950ల్లో ఈ హైబ్రీడ్‌ను ప్రత్యేకమైన విధానంలో అంటుకట్టడం ద్వారా రూపొందించారు. జపాన్‌లో మియజాకీ ప్రిఫెక్చర్ వాతావరణ పరిస్థితులకు అనుగూణంగా ఉండేలా సిద్ధం చేశారు. ప్రత్యేకమైన తియ్యదనం, సువాసన ఉండే ఈ మామిడి రకానికి చూస్తుండగానే డిమాండ్ పెరిగిపోయింది.
Also Read: భయానక దృశ్యం.. సముద్రంలో తేలుతున్న మంచు ఫలకంపై ఎక్కితే
ఒక్కో పండు సుమారు 350 గ్రాముల నుంచి 550 గ్రాముల వరకూ ఉంటుంది. పండు కూడా సుతిమెత్తగా ఉంటుంది. దీని రుచి, సువాసన, ప్రత్యేకమైన రంగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుకు ఆదరణ పెరిగింది.
మియాజాకీ మామిడి ప్రత్యేకమైన నియంత్రిత విధానంలో సాగు చేస్తారు. చీడపీడలు సోకకుండా రైతులు పండ్లకు పాలిథీన్ బ్యాగులు చుడతారు. మొక్క దశ నుంచి కాయలు కాసే దశ వరకూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అత్యంత నాణ్యమైన పండ్లు కాసేలా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతర మామిడి పండ్లతో పోలిస్తే భిన్నమైన రుచి రంగు ఉండటంతో ఈ మామిడికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. సాగు విస్త్రీర్ణం మాత్రం ఈ స్థాయిలో పెరగకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి.
Also Read: భారతీయ వీధులు శుభ్రం చేసిన విదేశీ టూరిస్టులు!
2021లోనే ఈ మామిడి భారత్‌లో కూడా అడుగుపెట్టింది. బీహార్‌లోని ధనాకియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ అనే రైతు రెండు మియాజాకీ మామిడి మొక్కలను దిగుమతి చేసుకున్నారు. తొలి ఏడాదిలోనే ఇవి 21 మామిడి కాసాయట. దీంతో, భారతీయ కుబేరులకు కూడా ఈ మామిడి అందుబాటులోకి వచ్చినట్టైంది. ఇక త్వరలో మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ పండు పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది.