AP Politics: పరిపూర్ణానంద స్వామి బిగ్ ట్విస్ట్.. టికెట్ ఇవ్వకపోతే ఆ పని చేస్తా
ABN , Publish Date - Mar 27 , 2024 | 05:42 PM
తనకు హిందూపురం ఎంపీ టికెట్ దొరుకుతుందని ఎంతో ఆశించిన పరిపూర్ణానంద స్వామికి చివరకు నిరాశే మిగిలింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. ఆ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అటు.. బీజేపీ ప్రకటించిన ఆరు ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో ఆయన మరింత నిరాశ చెందారు.
తనకు హిందూపురం (Hindupur) ఎంపీ టికెట్ దొరుకుతుందని ఎంతో ఆశించిన పరిపూర్ణానంద స్వామికి (Paripurnananda Swami) చివరకు నిరాశే మిగిలింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో (TDP-Janasena-BJP Alliance) భాగంగా.. ఆ సీటు టీడీపీ (TDP) ఖాతాలోకి వెళ్లిపోయింది. అటు.. బీజేపీ (BJP) ప్రకటించిన ఆరు ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో ఆయన మరింత నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే ఓ సంచలన ప్రకటన చేశారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని అన్నారు. తాజాగా మరోసారి ఆయన అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గానే ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెగేసి చెప్పారు. బుధవారం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని (Daggubati Purandeswari) కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Sunita Kejriwal: ఢిల్లీలో బిహార్ సీన్ రిపీట్.. కేజ్రీవాల్ సీఎం కుర్చీలో భార్య!
పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. ‘‘నేను హిందూపురం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వమని అడిగేందుకే పురందేశ్వరిని కలిశాను. టీడీపీ, జనసేనలతో (Janasena) పార్టీలతో పొత్తు కుదరడానికి ముందు నుంచే బీజేపీ హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని నేను పని చేస్తున్నా. నా అభిప్రాయం అధిష్టానానికి తెలపడానికే వచ్చాను’’ అని చెప్పారు. ఉదయం వచ్చిన వాళ్లు మధ్యాహ్యానికే అభ్యర్థులైపోతారా..? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పొత్తు కారణంగా ప్రస్తుతం బీజేపీ కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ తాను హిందూపురం నుంచి పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. ఒకవేళ బీజేపీ తనకు టికెట్ ఇస్తే పార్టీ తరఫున ఎంపీగా చేస్తానని.. టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగానే ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. కాగా.. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నేత బీకే పార్థసారిథి (BK Parthasarathi) పోటీ చేయబోతున్నారు. ఇక అసెంబ్లీకి సినీ నటుడు బాలకృష్ణ (Balakrishna) మరోసారి బరిలోకి దిగబోతున్నారు.
Miss Universe: చరిత్ర సృష్టించిన ఆ దేశం.. తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో!
అంతకుముందు.. పెనుగొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో తానెందుకు హిందూపురం నుంచే పోటీ చేయాలనుకుంటున్నానో పరిపూర్ణానంద స్వామి తెలిపారు. దక్షిణాదిలో హిందూపురం ఎంతో ముఖ్యమైన ప్రాంతమని అన్నారు. ‘హిందూపురం’లో హిందూ అనే పేరు ఉందని, అందుకే తాను అక్కడి నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. మొదట్లో బీజేపీ అధిష్టానం తనకే హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించిందని, కానీ పొత్తులో భాగంగా అది దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా.. తాను స్వతంత్రంగా ఈ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానని, ఇప్పటికే తన ఎన్నికల ప్రచార ప్రక్రియను కూడా మొదలుపెట్టానని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
Chandrababu: జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు.. మంత్రి రోజాపై చంద్రబాబు విసుర్లు
AP News: సలహదారు పదవి నుంచి చంద్రశేఖరరెడ్డిని తొలగించండి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి