Share News

AP Elections Polling 2024: పలు చోట్ల ఇంకా ప్రారంభం కాని పోలింగ్.. ఓటర్ల ఆగ్రహం..!

ABN , Publish Date - May 13 , 2024 | 09:10 AM

ఈవీఎం మొరాయింపుతో ఓటర్లు కాస్త అసహనంగా ఉన్నారు. గన్నవరం స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చే ఈవీఎం కోసం రంగన్నగూడెం గ్రామ ఓటర్లు ఎదురుచూపులు చూస్తున్నారు.

AP Elections Polling 2024: పలు చోట్ల ఇంకా ప్రారంభం కాని పోలింగ్.. ఓటర్ల ఆగ్రహం..!
AP Election 2024

ఆంధ్రాలో (Andhrapradesh) పలుచోట్ల కాని ఓటింగ్, మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. కృష్ణా బాపులపాడు మండలం రంగన్న గూడెం 182వ నంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయింపుతో ఓటర్లు కాస్త అసహనంగా ఉన్నారు. గన్నవరం స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చే ఈవీఎం కోసం రంగన్నగూడెం గ్రామ ఓటర్లు ఎదురుచూపులు చూస్తున్నారు. పోలింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం ఇక్కడ ప్రజల్లో చికాకు తెప్పిస్తుంది.

నెల్లూరు పల్లి పంచాయతీ పరిధిలోని 175 పోలింగ్ బూత్‌లో పనిచేయని ఈవీఎంల కారణంగా ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని ఓటర్లు నిరీక్షిస్తున్నారు.

ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలోని 168,170, పోలింగ్ కేంద్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ మోరాయించిన ఈవీఎంల కారణంగా పోలింగ్ కాసేపు నిలిచిపోయింది. ఇంకా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో బారులు తిరిగిన ఓటర్లు.

ఓవైపు మొరాయిస్తున్న ఈవీఎంలు.. మరోవైపు భారీ వర్షం..

బుచిరెడ్డిపాలెం మండలం, పంచెడు గ్రామంలో పోలింగ్ ప్రాంతంలో కూడా ఈవీఎంలు పనిచేయక ఓటర్లు అసహనంతో ఎదురుచూస్తున్నారు. ఓపక్క పైన ఎండ వేడి పెరుగుతున్న కారణంగా కాస్త ముందుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చినా ఫలితంలేకపోవడం పై అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ప్రచారాన్ని నిర్వహించకూడదనే రూల్ అతిక్రమించి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని పోలీసులు చెదరగొట్టారు. అటు అధికార పార్టీనాయకులు, ఇటు టిడిపి నాయకులు అభ్యంతరం చెప్పడాన్ని పోలీసులు అందరినీ అక్కడిన నుంచి దూరంగా పంపించారు.

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట 47 వ పోలింగ్ బూత్‌లో మోరాయించిన ఈవిఎం యంత్రాల కారణంగా కాసేపు పోలింగ్ నిలిచిపోయింది. ప్రజలు బారులు తీరారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు బూత్ అధికారులు.

విశాఖ, పెందుర్తి నియోజకవర్గం ఆర్ఆర్ వెంకటాపురం, పోలింగ్ బూత్ నంబర్ 193 లో పనిచేయని ఈవీఎం గంట పైగా నిలిచిపోయిన పోలింగ్ వేచి చూస్తున్న ఓటర్లు. ఈ కారణంగా 2 గంటల ఆలస్యంగా ఇక్కడ పోలింగ్ ప్రారంభం అయింది.

Updated Date - May 13 , 2024 | 09:27 AM