Share News

AP Elections 2024: ఓవైపు మొరాయిస్తున్న ఈవీఎంలు.. మరోవైపు భారీ వర్షం..

ABN , Publish Date - May 13 , 2024 | 07:57 AM

ఓటింగ్ సమయం ప్రారంభం కావడంతో ఓటర్లు ఉదయాన్నే కేంద్రాలకు తరలివస్తున్నారు. కొందరు ఎండలకు భయపడి ముందే ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఓ పక్క జిల్లాలో పలు చోట్ల మొరాయిన్న ఈవీఎంలు (EVMs)మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. వరికుంటపాడులోని జడ్పీహెచ్ స్కూల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి.

AP Elections 2024: ఓవైపు మొరాయిస్తున్న ఈవీఎంలు.. మరోవైపు భారీ వర్షం..
Andhra Pradesh

ఓటింగ్ సమయం ప్రారంభం కావడంతో ఓటర్లు ఉదయాన్నే కేంద్రాలకు తరలివస్తున్నారు. కొందరు ఎండలకు భయపడి ముందే ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఓ పక్క జిల్లాలో పలు చోట్ల మొరాయిన్న ఈవీఎంలు (EVMs)మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది.

వరికుంటపాడులోని జడ్పీహెచ్ స్కూల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. బుచ్చిరెడ్డిపాలెంలోని డీఎల్ రవీంద్రనాధ్ స్కూల్ లో రెండు చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈవీఎంలు(EVMs), మొరాయించడం ఒకవైపు, మరో వైపు ఆత్మకూరు నియోజకవర్గంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయింపుతో ఆలస్యంగా మాక్ పోలింగ్.

ఏలూరులో ఎండలకు భయపడి సమయానికి ముందే చేరుకున్న ఓటర్లు..!

కర్నూలు జిల్లాలో ఎలక్షన్స్ (Elections) ప్రారంభమైన పోలింగ్.. పలుచోట్ల భారీ వర్షం ఓటర్లను నిరుత్సాహ పరుస్తుంది. గొడుగులు పట్టుకొని, జర్కిన్లు వేసుకుని, వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.

విజయవాడలో ఉదయం ఏడు గంటలకు లయోలా కాలేజీ, బూతు నెంబర్ 56 లో తన ఓటు హక్కుని వినియోగించుకున్న కేశినేని చిన్ని. లయోలా కాలేజీలోని మోడల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కేసినేని చిన్ని, ఆయన కుటుంబ సభ్యులు. అయితే ఈవీఎం మిషన్ పనిచేయకుండా మొరాయించడంతో పోలింగ్ పదినిమిషాల పాటు ఆలస్యంగా మొదలైంది. ఆతర్వాత తన ఓటును వినియోగించుకున్నారు కేసినేని చిన్ని.

Updated Date - May 13 , 2024 | 07:57 AM