Share News

Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభం

ABN , Publish Date - Feb 11 , 2024 | 07:22 AM

శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం కార్యక్రమం ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో యువనేత శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తారు.

 Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం కార్యక్రమం ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో యువనేత శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తారు. ఈరోజు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో లోకేష్ సభలు నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికే ఆయన ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయటం, వైసీపీ ప్రభుత్వ వ్యఫల్యాలను ఎండగట్టే విధంగా లోకేష్ కార్యక్రమాలు ఉంటాయి.

వైసీపీ ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ చేపడుతున్న ‘శంఖారావం’ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటలకు ఇచ్ఛాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ నిర్వహించనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నారు. యువగళం పాదయాత్ర ముగించినప్పటికీ.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేశ్‌ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆదివారం నుంచి నలభైరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో ‘శంఖారావం’ పేరుతో సభలు నిర్వహించనున్నారు.

ఈనెల 21 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో సభలు నిర్వహిస్తారు. లోకేశ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ యంత్రాంగం మొత్తం తొలిరోజున ఇచ్ఛాపురం సభపై దృష్టి సారించింది. కీలకనాయకులందరూ ఇచ్ఛాపురానికి చేరుకుని, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ‘సెల్ఫీ విత్‌ లోకేశ్‌’ కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాల ప్రతినిధులు, కులసంఘాల నాయకులు.. ఇలా వర్గాల వారీగా లోకేష్‌ను ఈ సభలలో కలసి వినతులు ఇవ్వవచ్చు. ఇచ్ఛాపురంలో సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పరిశీలించారు. వేలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు చేశారు.

Updated Date - Feb 11 , 2024 | 09:05 AM