Share News

TDP Raa KadaliRaa at Gudiwada: బూతులు మాట్లాడిన వ్యక్తులూ ఖబర్ధార్.. జాగ్రత్తగా ఉండండి: చంద్రబాబు

ABN , First Publish Date - Jan 18 , 2024 | 04:06 PM

‘రా కదలిరా’ పేరిట గుడివాడలో తెలుగుదేశం పార్టీ (TDP) నిర్వహించిన భారీ బహిరంగ సభకు టీడీపీ శ్రేణుల పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. పార్టీ శ్రేణులను ఉద్దేశించి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు...

TDP Raa KadaliRaa at Gudiwada: బూతులు మాట్లాడిన వ్యక్తులూ ఖబర్ధార్.. జాగ్రత్తగా ఉండండి: చంద్రబాబు

Live News & Update

  • 2024-01-18T20:30:21+05:30

    నిర్లక్ష్యం వహిస్తే పెద్ద తప్పు జరుగుతుంది: చంద్రబాబు

    • ఏపీ మొత్తం టీడీపీ - జనసేన గాలి వీస్తోంది

    • టీడీపీ - జనసేన గాలి సునామీలా మారడం ఖాయం

    • మరో 83 రోజులే ఉంది.. అప్రమత్తంగా ఉండాలి

    • ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు

    • నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే పెద్ద తప్పిదం జరుగుతుంది

    • టీడీపీ - జనసేన పార్టీల అవసరం ఉందని ప్రజలను చైతన్యపర్చాలి

  • 2024-01-18T20:00:10+05:30

    జాబ్ రావాలంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలి: చంద్రబాబు

    • ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం

    • చేసిన పనులు ధైర్యంగా చెప్పుకునే పార్టీ టీడీపీ

    • తప్పులు చేసి పరదాలు కట్టుకుని తిరిగే పార్టీ వైసీపీ

    • ప్రభుత్వ జీవోలు బయటకు రాకుండా దాచిపెట్టారు

    • తప్పుడు, చీకటి జీఓలను వెబ్‌సైట్‌లో పెట్టారు

  • 2024-01-18T19:00:30+05:30

    • గుడివాడ నుంచే ఎన్టీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు: చంద్రబాబు

    • టీడీపీ, జనసేన కార్యకర్తల శక్తిని ఎవరూ ఆపలేరు

    • మహానుభావులు పుట్టిన నేల కృష్ణా జిల్లా

    • కృష్ణా జిల్లాలో కొన్ని గంజాయి మొక్కలు పుట్టాయి

    • కృష్ణా జిల్లాలో పుట్టిన గంజాయి మొక్కల్ని పీకేయాలి

    • వైసీపీ నేతలకు వడ్డీతో పాటు చక్రవడ్డీ కలిపి చెల్లిస్తాం

    • IAS అధికారి కూడా దొంగ ఓట్లు వేయించే దుస్థితి తెచ్చారు

    • పోలీసులపైనా ఒత్తిళ్లు వస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి

  • 2024-01-18T18:38:14+05:30

    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన గెలుపు అన్‌స్టాపబుల్

    • జాబ్ రావాలంటే.. టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలి

    • ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి అనుసంధానం చేస్తాం.

    • ఏపీలో నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.4 లక్షల భారం పడింది.

    • జగన్ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ

  • 2024-01-18T18:27:37+05:30

    వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్

    • బాబాయి హత్య కేసులో అసలు నేరస్థులు ఇంకా అరెస్ట్ కాలేదు.

    • సీబీఐపైనే వైసీపీ కేసులు పెట్టింది.

    • ఆదాయం పెంచి ఆదుకునేదే సరైన ప్రభుత్వం.. పేదల రక్తం తాగే ప్రభుత్వం ఇది

    • ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరూ చూస్తున్నారు.

    • జగన్ వస్తే పోలవరం ఆగిపోతుందని ఆనాడే చెప్పాను.

    • టీడీపీ - జనసేన ప్రభుత్వం వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ప్రతి యువకుడికి ఉద్యోగం ఇస్తాం.

  • 2024-01-18T18:14:51+05:30

    గుడివాడ బహిరంగ సభలో చంద్రబాబు కామెంట్స్...

    • జగన్ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం

    • అన్న క్యాంటిన్ నుంచి విదేశీ విద్య వరకు వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసింది.

    • టీడీపీ ఎవ్వరికీ భయపడదు.. భయపడే ప్రసక్తే లేదు

    • పేదవాడు పేదరికంలో ఉంటే జగన్ సంపన్నుడయ్యాడు

    • రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేశారు.

    • అహంభావం ఉండే సీఎం మనకు అవసరమా?

    • బీసీ నేతలకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వరు

    • టీడీపీ రాగానే భూరక్షణ చట్టం రద్దు

    • అప్పుల కోసం మాత్రమే ఆర్థిక మంత్రి ఉన్నారు

    • సొంత మద్యం బ్రాండ్లతో దోచుకుంటున్నారు

  • 2024-01-18T18:02:20+05:30

    తులసీవనంలో గంజాయి మొక్కలు పుట్టాయి: చంద్రబాబు

    • ప్రతి ఒక్కరికీ ఒక కీర్తి ఉంటుంది

    • గుడివాడ బూతులు, దోపిడీ, పేకాటలు, కేసినోలకు కేంద్రంగా మారింది

    • టీడీపీ ఎవ్వరికీ భయపడదు

    • దేశానికి మహానుభావులను అందించింది కృష్ణా జిల్లా

    • జాతికోసం పునరంకితం అవుదామని పిలుపునిస్తున్నాను

  • 2024-01-18T17:50:03+05:30

    బూతులు మాట్లాడిన వ్యక్తులూ కబర్ధార్.. జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ‘రా.. కదలిరా’ కార్యక్రమంలో మాట్లాడారు.

  • 2024-01-18T17:44:53+05:30

    వైసీపీ ప్రభుత్వం గుడివాడకు ఏమీ చేయలేదని నియోజకవర్గ టీడీపీ ఇన్‌‌ఛార్జ్ వెనిగండ్ల రాము అన్నారు. టీడీపీకి జనసేన మద్ధతు ప్రకటించడంతో ఆపేవారు ఎవరూలేరని అన్నారు. తట్టాబుట్టా సర్దుకోవడానికి సిద్ధంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిని హెచ్చరించారు.

    Untitled-1.jpg

  • 2024-01-18T17:31:28+05:30

    ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించిన టీడీపీ శ్రేణులు

  • 2024-01-18T17:14:34+05:30

    బేషరతుగా చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానన్న పవన్ కల్యాణ్‌ను ప్రశంసించాలి: వెనిగండ్ల రాము

    ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంతోనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ వెనిగండ్ల రాము అన్నారు. ఆ నాడు ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చి ఉంటే ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యుండేవారని అన్నారు. ఎన్టీఆర్ సమకాలీన సినిమా నటులు అంతపెద్దగా గుర్తులేరనేది వాస్తవమని ఆయన అన్నారు. రాజకీయాల్లో ప్రజలకు ఏమైనా చేయాలంటే భావోద్వేగాలు ముఖ్యమని, తనకు ఎన్ని సీట్లు ఇస్తారని అడగకుండా బేషరతుగా చంద్రబాబుతో, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రశంసించాలని వెనిగండ్ల రాము అన్నారు. రా.. కదలిరా బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు.

  • 2024-01-18T17:05:45+05:30

    గుడివాడలో జరుగుతున్న ‘రా.. కదలిరా’ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

    Untitled-10.jpg

  • 2024-01-18T16:54:25+05:30

    ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు దంపతులు నిమ్మకూరులో పర్యటించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించారు. నిమ్మకూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

  • 2024-01-18T16:45:50+05:30

    ఎన్టీఆర్ రూపంలో మనందరం రాముడిని చూశాం: చంద్రబాబు

    పేదవాళ్లకు సాయం చేయడమే నిజమైన రాజకీయం అని ఎన్టీఆర్ చాటి చెప్పారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ రూపంలో అందరూ రాముడిని చూశారని అన్నారు. సమాజానికి ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఇదని చంద్రబాబు అన్నారు.

  • 2024-01-18T16:37:56+05:30

    Chandrababu-NTR.jpg

    సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్ర ఎవరూ పోషించలేరు. పోషించబోరు. ఎన్టీఆర్ రాజకీయాల్లో 13 సంవత్సరాలే ఉన్నారు. అతి స్వల్పకాలంలోనే రాజకీయానికి ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చారు: చంద్రబాబు

  • 2024-01-18T16:33:48+05:30

    ఎన్టీఆర్ ఒక ఆదర్శం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎదిగారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదిగారు: చంద్రబాబు

  • 2024-01-18T16:25:53+05:30

    ప్రపంచంతో నిమ్మకూరును అనుసంధానిస్తా: చంద్రబాబు

    • రాముడు ఎలా ఉంటాడో చెప్పిన నాయకుడు ఎన్టీఆర్

    • సంపదను సృష్టించడమే ధ్యేయం

  • 2024-01-18T16:05:13+05:30

    నిమ్మకూరులో తెలుగుదేశం పార్టీ (TDP) నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ షురూ అయ్యింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి ప్రసంగిస్తున్నారు. ఈ సభకు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి. ఇక సమావేశం తర్వాత గుడివాడలో ‘రా కదలి రా’ పేరిట జరగనున్న భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు బహిరంగ సభలో ఉండనున్నారు. కాగా ఆంక్షల మధ్య ‘ రా.. కదిలి రా’ బహిరంగ సభ జరగనుంది. గురువారం ఉదయం టీడీపీ శ్రేణుల వాహనాలను బైపాస్ రహదారుల మీదుగా దారి మళ్లించారు. నెహ్రూ చౌక్ సెంటర్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో తెలుగుదేశం జెండాలు, బ్యానర్లు కట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ బహిరంగ సభ నేపథ్యంలో ముఖ్యమైన కూడళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. దీంతో ఉద్రిక్తతల మధ్య ఈ బహిరంగ సభ జరుగుతోంది.

    ఉద్రిక్తల నడుమ సభ..

    మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఉదయం బైపాస్ రోడ్డులో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టగా పోలీసులు బారీకేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ వెనిగళ్ల రామ్మోహన్‌ నాయకత్వంలో టీడీపీ, జనసేన శ్రేణలు బారీకేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో దూసుకువెళ్లారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణం నుంచి కొడాలి నాని వేరొక చోటుకి వెళ్లిపోయారు. వైసీపీ శ్రేణులు కూడా ఆయన వెంట వెళ్లిపోయారు.