Share News

Murder Mistery: రెండేళ్లు భార్య సమాచారం ఇవ్వకుండా..

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:31 PM

రెండేళ్లపాటు అత్తింటి వాళ్లు ఫోన్ చేసినా వాళ్ల కూతురితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కుంటి సాకులు చెబుతూ వచ్చాడు. చివరికి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.

Murder Mistery: రెండేళ్లు భార్య సమాచారం ఇవ్వకుండా..
UP Wife Murder

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి ఘాతుకానికి పాల్పడ్డాడు ఒక భర్త. సోదరుడు, అత్తతో కలిసి భార్యను చంపేశాడు. కూతురితో మాట్లాడుదామని పుట్టింటివాళ్లు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఇవ్వకుండా వాళ్లకి కుంటిసాకులు చెప్పి ఏకంగా రెండేళ్లపాటు నడుపుకుంటూ వచ్చాడు. తమ కూతుర్ని ఎంతకీ కలవనివ్వకపోవడం, కనీసం మాట్లాడనివ్వకపోవడంతో అనుమానం వచ్చిన అత్తింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం గుట్టు బయట పడింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

చంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌ సర్కిల్ ఆఫీసర్ (CO) భరత్ సోన్కర్ చెబుతున్న వివరాల ప్రకారం, ఆసిఫా అనే (28) ఏళ్ల యువతికి కమిల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. కొంత కాలం వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగినా తర్వాత భర్త కమిల్ కు ఆసిఫా మీద అనుమానపు బీజాలు నాటుకున్నాయి. ఆసిఫా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి తన సోదరుడు, తన బంధువైన ఒక మహిళతో కలిసి ఆసిఫాను చంపేశాడు. తన కూతురైన ఆసిఫా సమాచారం ఏమీ తెలియకపోవడంతో ఆసిఫా పుట్టింటి వారిలో ఆందోళన మొదలైంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కమిల్ సమాధానం సరిగా చెప్పకపోవడం, పనిలో ఉంది, ఊరికి వెళ్లిందని సాకులు చెబుతూ ఏకంగా రెండేళ్లు గడిపేశాడు.

దీంతో అనుమానం వచ్చి ఆసిఫా తల్లి మార్చి 26న చంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో తన కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు నమోదు చేసింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి కమిల్, అతని సోదరుడు ఆదిల్‌ను తమ దైన స్టైల్లో ప్రశ్నించారు. ఆసిఫాకు అక్రమ సంబంధం ఉందని అనుమానించి నవంబర్ 23, 2023న హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. తన సోదరుడు ఆదిల్, వారి అత్త చాంద్నీ సహాయంతో ఆసిఫాను గొంతు నొక్కి చంపి, ఆ తర్వాత ఆమె శవాన్ని పాతిపెట్టినట్టు చెప్పాడు. దీంతో వెతికిన పోలీసులకు ఆసిఫా మృతదేహ భాగాలు వారి ఇంటి సమీపంలోని చెత్త కుప్ప దగ్గర తవ్వితే దొరికాయి. దీంతో సోదరులిద్దర్నీ అరెస్టు చేసిన పోలీసులు వాళ్ల అత్త చాంద్నీ కోసం గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి..

20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..

ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

For More AP News and Telugu News

Updated Date - Apr 06 , 2025 | 01:34 PM