AndhraPradesh: జగన్ ఆత్మబంధువుకి ఝలక్
ABN , Publish Date - Oct 19 , 2024 | 07:19 PM
ఈ ఎన్నికల ఫలితాలపై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సైతం స్పందించారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ అవసరం చాలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. విశాఖలోని శారదాపీఠానికి నాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు... ఉన్నతాధికారులు సైతం క్యూ కట్టారు. అయితే గతంలో విశాఖపట్నం నగర శివారులో ఈ శారదా పీఠం ఉండేది.
అమరావతి, అక్టోబర్ 19: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆత్మబంధువు, విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. గత ప్రభుత్వం విశాఖపట్నంలో సదరు పీఠానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందుకు సంబంధించిన అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో శారదా పీఠానికి 15 ఎకరాలను కేటాయిస్తూ గత జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం విలువ రూ. 220 కోట్ల ఉంటుందని ఆరోపణలు వచ్చాయి. నాటి జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర ఆరోపణలు సైతం వ్యక్తమైన్నాయి.
Also Read: Chattisgarh: రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఇద్దరు జవాన్లు మృతి
Also Read: Heavy Rains: ఉత్తరాంధ్రకు గండం.. వాయుగుండం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. అందులోభాగంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రద్దు చేసింది. అందులోభాగంగా శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి కేటాయించిన స్థలానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. ఈ అనుమతులకు సంబంధించిన రద్దు ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశముందని సమాచారం.
Also Read:PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ. 15 లక్షల సాయం
స్వామి వారి సేవలో...
2014 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా పరిమితమయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో అధికారం పీఠం అందుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర సైతం చేశారు. అందులోభాగంగా తాను హిందువుననే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అలా విశాఖలోని శారదాపీఠం శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి దోస్తి కుదిరింది. ఆయనతో కలిసి తిరుమల శ్రీవారిని సైతం వైఎస్ జగన్ చేసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read: Maoist Party: కిషన్ జీ భార్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్ట్ పార్టీ
ఈ ఎన్నికల ఫలితాలపై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సైతం స్పందించారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ అవసరం చాలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. విశాఖలోని శారదాపీఠానికి నాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు... ఉన్నతాధికారులు సైతం క్యూ కట్టారు. అయితే గతంలో విశాఖపట్నం నగర శివారులో ఈ శారదా పీఠం ఉండేది.
Also Read:Telangana: బావ బామ్మర్దుల తీరు ఈస్టమన్ కలర్ లాగా ఉంది
Also Read: Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం
ఇక జగన్ ప్రభుత్వం.. ఈ శారదా పీఠానికి 15 ఎకరాలు కేటయించింది. ఈ కేటాయింపులపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం హైదరాబాద్ నగర శివారులో విలువైన భూములను శారదా పీఠానికి కేటాయించారు. ఈ వ్యవహారంపై కూడా ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఈ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో మరోసారి అధికారం కోసం కేసీఆర్ యాగం సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News