Share News

Mukkoti Ekadashi: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు..

ABN , Publish Date - Jan 10 , 2025 | 07:05 AM

ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల ముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు సాయంకాలం సంధ్యా సమయంలో పూజ చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. జాగారం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కధలు, హరికథా కాలక్షేపంతో జాగరణ చేస్తే..

Mukkoti Ekadashi:  తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు..

తిరుమల: అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల (Tirumala)లో శుక్రవారం వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈరోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను అధికారులు రద్దు చేశారు. ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికీ ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించారు. పూజది కైంకర్యాలు ముగిసిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై ఆలయ తిరు విధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవ మూర్తులు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ వార్త కూడా చదవండి:

ముక్కోటి ఏకాదశి రోజు.. ఏం చేయాలి..


శుక్రవారం వేకువజాము నుంచి భక్తులను దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రముఖులకు 4250 పాసులని మంజూరు చేశారు. లఘు దర్శనంలో ప్రముఖులకు స్వామి వారీ దర్శనం కల్పిస్తున్నారు. కాగా తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాందేవ్ బాబా, మంత్రులు అనిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బండ్ల గణేష్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, చాముండేశ్వరి నాథ్, పుల్లెల గోపీచంద్ తదితరులు దర్శించుకున్నారు.


విశాఖ సింహాచలంలో..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం క్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం వైభవ పితంగా ప్రారంభమైంది.. సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ ఉత్తర గోపురంలో వైకుంఠనాధుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు, టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఉత్తర ద్వారం ద్వారా సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు.

నెల్లూరులో...

నెల్లూరులో ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ది చెందిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్బంగా అధికారులు ఆలయంలో భారీ ఏర్పాట్లు చేశారు. వీఐపీ దర్శనాలు రద్దు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పుడు ఇల్లే వైకుంఠం

చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 10 , 2025 | 08:03 AM