Share News

Reservation : దివ్యాంగులకు రిజర్వేషన్‌ అమలుపై ఆదేశాలివ్వండి

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:10 AM

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్‌ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

Reservation : దివ్యాంగులకు రిజర్వేషన్‌ అమలుపై ఆదేశాలివ్వండి

  • హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు

అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్‌ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారం పై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్త్రీ, శిశు, దివ్యాంగుల శాఖ ముఖ్య కార్యదర్శి, తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్‌ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఇండియన్‌ డిసేబుల్డ్‌ ఎంపవర్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుంటుపల్లి సతీశ్‌ గోవింద్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated Date - Jan 10 , 2025 | 06:10 AM