AP elections: విశాఖ సౌత్‌లో నెగ్గేదెవరు..?
ABN , Publish Date - Apr 12 , 2024 | 11:43 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మహానగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసింది. ఓవైపు అమరావతిని అభివృద్ధి చేకయక, మరోవైపు విశాఖపట్టణం పేరును వాడుకుని జగన్ ప్రభుత్వం కాలక్షేపం చేసిందనే విమర్శలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఉన్న మహానగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ (YSRCP) ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసింది. ఓవైపు అమరావతిని అభివృద్ధి చేకయక, మరోవైపు విశాఖపట్టణం పేరును వాడుకుని జగన్ ప్రభుత్వం కాలక్షేపం చేసిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖపట్టణం సిటీలో మూడు నియోజకవర్గాలుండగా.. వీటిలో విశాఖ సౌత్ నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. నియోజకవర్గం అభివృద్ధి పేరుతో అధికార వైసీపీలో చేరారు. ఐదేళ్ల కాలంలో తన ఆస్తులు రెట్టింపు చేసుకున్నారే తప్పా.. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన చేసిందేమీ లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Nara Bhuvaneshwari: సంక్షేమం పేరిట దోచేశాడు
ఎన్నో సమస్యలు..
నగరం మధ్యలో ఉన్నప్పటికీ.. వైసీపీ పాలనలో ఇక్కడ జరిగిన అభివృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. డాబాగార్డెన్స్, పాత పోస్ట్ ఆఫీస్ ఏరియా, జగదాంబా జంక్షన్, అల్లిపురం, ద్వారకానగర్, జ్ఞానాపురం ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. శరవేగంతో వృద్ధి చెందుతున్న విశాఖపట్టణం వైసీపీ పాలనలో వెనుకబడిపోయిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు ఉండటంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ఇక్కడి ఎమ్మెల్యే పరిష్కరించలేకపోయారు. రోడ్లమీదనే ప్రవహించే మురుగు కాలువలు, పేరుకుపోయిన చెత్త, దుర్వాసన, మురికికాలువలపై తేలే వ్యర్ధాలు, దోమల సంచారంతో విశాఖ సౌత్ నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్టణం దక్షిణ నియోజకవర్గంలో పారిశుధ్యం అతిపెద్ద సమస్యగా ఉంది.
అభ్యర్థులు వీళ్లే..
విశాఖపట్టణం సౌత్ నుంచి ఈ ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీ బలపర్చిన జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం జనసేన కోటాలోకి వెళ్లడంతో వంశీకృష్ణ యాదవ్ సీటు దక్కించుకున్నారు. వైసీపీ నుంచి సీటు దక్కకపోవడంతో వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఫలితం జూన్4న తేలనుంది.
YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..