Share News

రూ.5 లక్షల కోట్లు ఆవిరి

ABN , Publish Date - May 08 , 2024 | 04:45 AM

మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం నష్టాలు చవిచూశాయి...

రూ.5 లక్షల కోట్లు ఆవిరి

383 పాయింట్లు నష్టపోయున సెన్సెక్స్‌

  • 22,300 స్థాయికి జారుకున్న నిఫ్టీ

  • స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లలో పోటెత్తిన అమ్మకాలు

ముంబై: మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం నష్టాలు చవిచూశాయి. ఒకదశలో 636.28 పాయింట్లు పతనమై 73,259.26 వద్దకు జారుకున్న సెన్సెక్స్‌.. చివరికి నష్టాన్ని 383.69 పాయింట్లకు పరిమితం చేసుకుని 73,511.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.20 పాయింట్లు కోల్పోయి 22,302.50 వద్ద స్థిరపడింది. చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 19 నష్టపోగా.. పవర్‌గ్రిడ్‌ షేరు 3.80 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. అమ్మకాల హోరులో బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.4.96 లక్షల కోట్లు తగ్గి రూ.398.44 లక్షల కోట్లకు పడిపోయింది.


ఇండిజీన్‌ ఐపీఓకు 7.34 రెట్ల బిడ్లు :హెల్త్‌కేర్‌ టెక్నాలజీ కంపెనీ ఇండిజీన్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) రెండో రోజు ముగిసేసరికి, ఇష్యూ సైజుకు 7.34 రెట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయి. రూ.1,841.75 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన కంపెనీ.. ఇష్యూ ధరల శ్రేణిని రూ.430-452గా నిర్ణయించింది.

  • ప్రీమియర్‌ రోడ్‌లైన్స్‌ ఐపీఓ ఈనెల 10న ప్రారంభమై 14న ముగియనుంది. ఇష్యూ ధర శ్రేణిని కంపెనీ రూ.63-67గా నిర్ణయించింది. తద్వారా రూ.40 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  • ప్లాంట్‌ బేస్డ్‌ స్పెషాలిటీ ఉత్పత్తుల తయారీ సంస్థ సంస్థార్‌ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్‌ ఆఫరింగ్‌లో భాగంగా కంపెనీ 4 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతోపాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 80 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించాలనుకుంటోంది.


ఎన్‌ఎ్‌సఈ ట్రేడింగ్‌ సమయం పెంపునకు సెబీ నో

ఈక్విటీ డెరివేటివ్‌ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలన్న ఎన్‌ఎ్‌సఈ ప్రతిపాదనను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్‌ బ్రోకర్ల నుంచి తగినంత ఫీడ్‌బ్యాక్‌ లభించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈక్విటీ డెరివేటివ్‌ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై మఽధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రేడింగ్‌ను నిర్వహించేందుకు ఎన్‌ఎ్‌సఈ సెబీ అనుమతి కోరింది.


18న ప్రత్యేక ట్రేడింగ్‌: ఎన్‌ఎ్‌సఈ

ఈనెల 18వ తేదీన (శనివారం) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ సెగ్మెంట్లలో ప్రత్యేక లైవ్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నట్లు ఎన్‌ఎ్‌సఈ ప్రకటించింది. ఆకస్మిక విపత్తులకు సంసిద్ధతను పరీక్షించేందుకు ఈ ట్రేడింగ్‌ను నిర్వహించనుంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను రెండు సెగ్మెంట్లుగా విభజించనున్నారు. తొలుత సాధారణ ట్రేడింగ్‌ ఉదయం 9.15 గంటల నుంచి పదింటి వరకు జరగనుంది. ఆ తర్వాత 11.45 గంటల నుంచి 12.40 గంటల వరకు డిజాస్టర్‌ రికవరీ సైట్‌ నుంచి ట్రేడింగ్‌ను నిర్వహించనున్నట్లు ఎన్‌ఎ్‌సఈ తెలిపింది. ఈ ఏడాదిలో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఈ తరహా ట్రేడింగ్‌ నిర్వహించడం ఇది రెండోసారి.

Updated Date - May 08 , 2024 | 04:45 AM