Share News

Kakani Govardhan Reddy: కాకాణి దాగుడుమూతలు!

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:27 AM

క్వార్జ్‌ అక్రమ తవ్వకాల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసుల నోటీసులను లెక్కచేయకుండా తప్పించుకుంటున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం తీర్పు రానుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Kakani Govardhan Reddy: కాకాణి దాగుడుమూతలు!

హైదరాబాద్‌లో పోలీసులకు కనిపించకుండా మాయం

దీంతో సమీప బంధువుకు నోటీసులు అందజేత

నేడు నెల్లూరులో విచారణకు రావాలని ఆదేశం

ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు

నెల్లూరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): క్వార్జ్‌ కేసులో పోలీసుల నోటీసులను మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి లెక్కచేయడం లేదు. పైగా వా రు వచ్చినప్పుడు ఇంట్లో ఉండకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. గత ఆదివారం నెల్లూరులో నోటీసులివ్వడానికి పోలీసులు నివాసానికి వెళ్లగా.. ఆయన కనిపించలేదు. దీంతో ఇంటి గేటుకు, గోడకు అంటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కార్యాలయానికి రమ్మని అందులో పేర్కొన్నారు. కానీ ఆయన రాలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడి నివాసంలో కూడా ఆయన లేకపోవడంతో బంధువుకు నోటీసు లు అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులో విచారణకు రావాలన్నారు. అయినా హాజరుకాలేదు. మళ్లీ బుధవారం మనుబోలు ఎస్సై రాకేశ్‌ తన బృందంతో హైదరాబాద్‌ వెళ్లారు. వారు వెళ్లిన సమయానికి ఆయన పత్లాలేకుండా పోయా రు. దరిమిలా ఆయన సమీప బంధువుకు నోలీసు లు అందించారు. గురువారం ఉదయం 11 గంటల కు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కార్యాలయానికి రావాలని స్పష్టంచేశారు.


విచారణకు రాకుండా ఆయన తప్పించుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే ఆయన గురువారం నెల్లూరు రానున్నట్లు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది. ఆయన వస్తే అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది. పొదలకూరు మండలం మహమ్మదాపురంలో ప్రభుత్వానికి చెందిన రుస్తుం మైన్స్‌లోకి అక్రమంగా చొరబడి రూ.250 కోట్ల విలు వ చేసే క్వార్జ్‌ను తవ్వుకుపోయారన్న అభియోగాల తో నమోదైన కేసులో కాకాణి ఏ-4గా ఉన్నారు. క్వారీ కి దిగువన ఉన్న ఎస్‌టీ కాలనీకి ప్రమాదం వాటిల్లే లా భారీ పేలుళ్లతో కాలనీని ధ్వంసం చేశారని, దాని ని ప్రశ్నించినందుకు తమను బెదిరించారని కొందరు ఎస్టీలు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ను చేర్చారు. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోసం ఒకటి.. పోలీసులు పెట్టిన కేసును పూర్తిగా కొట్టివేయాలని మరొక పిటిషన్‌ను ఆయన హైకోర్టులో దాఖలుచేశారు. గురువారం తీర్పు వెలువడనుంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:27 AM