Share News

2లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:18 AM

రబీలో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా మరో 50వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా పెంచాలని జేసీ ప్రభుత్వానికి నివేదించారని సివిల్‌ సప్లై జిల్లా మేనేజరు రాధిక తెలిపారు. శనివారం కుతుకులూరులో రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.

2లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
కుతుకులూరులో ధాన్యం తేమ మిషన్‌ను పరిశీలిస్తున్న రాధిక, ఎమ్మెల్యే నల్లమిల్లి

  • సివిల్‌ సప్లై జిల్లా మేనేజరు రాధిక

  • పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

అనపర్తి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): రబీలో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా మరో 50వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా పెంచాలని జేసీ ప్రభుత్వానికి నివేదించారని సివిల్‌ సప్లై జిల్లా మేనేజరు రాధిక తెలిపారు. శనివారం కుతుకులూరులో రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గొల్లు హేమ తులసి అఽధ్యక్షతన జరిగిన సభలో రాధిక మాట్లాడుతూ ఖరీఫ్‌లో 2లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యమిచ్చి 2.40లక్షలకు పెంచారని, లక్ష్యానికి మించి కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. రైతులకు అవసరమైన గోనె సంచులు సిద్ధంగా ఉంచామని, ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరిగా ఉండాలని చెప్పా రు. రైతులు వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ధాన్యం అమ్మకానికి సం బంధించి పలు సేవలను పొం దే వీలును ప్రభుత్వం కల్పించిందని డీఎం రాధిక పేర్కొన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఏఒక్క రైతు నష్టపోని విదంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి 24గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ములు జమ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గోదావరి డెల్లా ఈస్ట్రన్‌ ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మన్‌ తమలంపూడి సుధాకరరెడ్డి, డీసీ వెంకట సుబ్బారెడ్డి, సత్తి దేవదానరెడ్డి, తిరుమలరెడ్డి, కర్రి చిన్నారెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, తమలంపూడి సూర్రెడ్డి, సోమరాజు, స్వామి, తాతారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 01:18 AM