Gold Price News: పసిడి రేటు ఢమాల్.. వెంటనే కొనేసేయండి
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:42 AM
Gold Price News: పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఎన్నడూ చూడని విధంగా బంగారం రేట్లు దిగివచ్చాయి. దీంతో బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చాన్నాళ్ల తరువాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితి నెలకొనగా.. గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు గరిష్టస్థాయి నుంచి కుప్పకూలాయి. ఇటర్నేషనల్ మార్కెట్‌లో స్పార్ట్ గోల్డ్ ధర ఔన్స్‌పై కిందటిరోజు ఉదయం ఏకంగా 3001 డాలర్ల లెవల్స్‌లో ఉండగా.. ఇప్పుడు అది 3038 డాలర్లకు పడిపోయింది. ఇంట్రాడేలో 3020 డాలర్ల దిగువకు కూడా చేరింది. మరోవైపు వెండి ధర ఇంకా భారీగా కుప్పకూలిపోయింది. 33 డాలర్ల స్థాయి నుంచి 29.62 డాలర్లకు చేరింది.
రేట్లు ఇలా
దేశీయంగా కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని విధంగా బంగారం రేట్లు దిగొచ్చాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1600లకు పతనమైంది. దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు 84వేలకు పడిపోయింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1740కు తగ్గడంతో ప్రస్తుతం పది గ్రాములకు రూ.91640కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగానే దిగొచ్చాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1600 తగ్గి తులం రూ.84150 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.1740 పతనంతో పది గ్రాముల బంగారం ధర రూ. 91790 వద్ద ఉంది.
ఇవి కూడా చదవండి
Trump Tariffs Impact: మార్కెట్ ట్రంఫట్
Reduced Gold Rate: పసిడి ప్రియులకు తీపి కబురు.. తగ్గిన బంగారం ధర
Read Latest Business News And Telugu News