Share News

Chennai: ఆయన సెల్‌ఫోన్‌లో అన్నీ బూతు చిత్రాలే..

ABN , Publish Date - Dec 28 , 2024 | 10:32 AM

స్థానిక గిండిలోని అన్నా యూనివర్సిటీ(Anna University) విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్టయిన ‘సెక్సువల్‌ సైకో’ జ్ఞానశేఖరన్‌ సెల్‌ఫోన్‌లో 50కి పైగా అశ్లీల చిత్రాలున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు(Cybercrime police) గుర్తించారు.

Chennai: ఆయన సెల్‌ఫోన్‌లో అన్నీ బూతు చిత్రాలే..

- నిందితుడిపై 8 సెక్షన్ల కింద కేసు నమోదు

- సుమోటోగా కేసు స్వీకరించిన హైకోర్టు

చెన్నై: స్థానిక గిండిలోని అన్నా యూనివర్సిటీ(Anna University) విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్టయిన ‘సెక్సువల్‌ సైకో’ జ్ఞానశేఖరన్‌ సెల్‌ఫోన్‌లో 50కి పైగా అశ్లీల చిత్రాలున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు(Cybercrime police) గుర్తించారు. ఈ చిత్రాల్లో అతడి ముగ్గురు భార్యలతో లైంగిక దృశ్యాలు కూడా ఉండడంతో పోలీసులు దిగ్ర్భాంతి చెందారు. అన్నా వర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని తన సీనియర్‌తో ఈ నెల 24వ తేది రాత్రి వర్శిటీ ప్రాంగణంలో మాట్లాడుకుంటుండగా, ఓ వ్యక్తి వీడియో తీసి బెదిరించడంతో పాటు, తన స్నేహితుడిపై దాడి చేసి, తనపై అత్యాచారం చేసినట్లు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: Rains: బంగాళాఖాతంలో 3 రోజుల్లో మరో అల్పపీడనం


ఈ వ్యవహారంలో జ్ఞానశేఖరన్‌ (37)ను పోలీసులు అరెస్ట్‌ చేసి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. అనంతరం అతడిపై పలు కేసుల తీవ్రత దృష్ట్యా 8 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో, జ్ఞానశేఖరన్‌ సెల్‌ఫోన్‌ను పోలీసులు సైబర్‌ క్రైంకు అప్పగించారు. సైబర్‌ క్రైం నిపుణుల పరిశోధనల్లో, అతడి సెల్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫోల్డర్‌లో అశ్లీల చిత్రాలు బయల్పడ్డాయి. ఈ ఫోల్డర్‌ను తను మాత్రమే చూసేలా ప్రత్యేక పాస్‌వర్డ్‌ పెట్టుకున్నాడు. అలాగే బాధితురాలి చిత్రాలు కూడా అందులో ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై నిందితుడిని ఐదు రోజులు తమ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు.

nani2.jpg


సుమోటోగా స్వీకరించిన హైకోర్టు...

వర్శిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. అన్నాడీఎంకే మహిళా న్యాయవాది వరలక్ష్మి హైకోర్టుకు ఓ లేఖ రాశారు. అన్నావర్సిటీ విద్యార్థిపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ బయటకు రావడం దిగ్ర్భాంతి కలిగించిందని, అందువల్ల ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు. ఈ లేఖను అందుకున్న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి.లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.


ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అత్యాచారానికి గురైన యువతి రాత్రిపూట తన స్నేహితుడితో కలిసి వుండడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారని, ఆ యువతి ఎప్పుడు ఎక్కడైనా ఉండే హక్కు లేదా అని ప్రశ్నించింది. ‘నిర్భయ’ కోసం కేటాయించిన నిధులేమయ్యాయని, ఆ నిధుల్ని యూనివర్శిటీ ఏ మేరకు ఖర్చు చేసిందని ప్రశ్నించింది. అసలు విద్యార్థినుల భద్రతకు యూనివర్సిటీ తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించింది.


ఈ వ్యహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌, అన్నా వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌, కోట్టూరుపురం మహిళా పోలీస్‏స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించింది.

నేడు అన్నా వర్సిటీకి గవర్నర్‌

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి శనివారం అన్నాయూనివర్శిటీని పరిశీలించనున్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని, హాస్టల్‌ గదులను పరిశీలించడంతో పాటు వర్సిటీ అధికారులతో సమావేశం కానున్నారు.


ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు

ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2024 | 11:41 AM