Telangana: నేటితో ముగియనున్న ప్రచారం..
ABN , Publish Date - May 11 , 2024 | 10:52 AM
నేటి సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. అరవై రోజుల పాటు సాగిన ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు మైకులు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది.
హైదరాబాద్: నేటి సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. అరవై రోజుల పాటు సాగిన ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు మైకులు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది. మిగతా ఏరియాల్లో ఆరు గంటల వరకూ ఓటు వేసేందుకు అవకాశం ఉంది. విమర్శలు , ప్రతి విమర్శల మధ్య జోరుగా సాగిన ప్రచారం నేటితో ముగియనుంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది.
Hyderabad: హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు భారీగా పయనం..
తెలంగాణలో ఈ అరవై రోజుల పాటు వివిధ పార్టీలు నిర్వంచిన ప్రచారంలో కొన్ని కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై 48 గంటల పాటు ఎన్నికల కమిషన్ ప్రచారం నిషేధించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో దాదాపు మూడు వందల కోట్ల వరకూ డబ్బును అధికారులు సీజ్ చేశారు. 8481 కేసులను ఎన్నికల కమిషన్ నమోదు చేసింది. మొత్తం 2 లక్షల 91 వేల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 35వేల 809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్‌లో మూడు వేల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇదికూడా చదవండి: Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్
Read Latest Telangana News and National News