Share News

Health Tips: ఒక్క స్పూన్ వాము గింజలతో యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టొచ్చట.. ఇంతకీ ఎలా వాడాలంటే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:52 PM

రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగితే శరీరంలో ఎముకలు దెబ్బతింటాయి. గౌట్ సమస్య కూడా వస్తుంది. దీన్ని తగ్గించడానికి ఒక స్పూన్ వాము చాలంట.

Health Tips: ఒక్క స్పూన్ వాము గింజలతో యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టొచ్చట.. ఇంతకీ ఎలా వాడాలంటే..
Uric Acid

రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గౌట్ సమస్యలు వస్తాయి. ఇందులో కాళ్లు, చేతులలో ఎముకలు బయటకు పొడుచుకు వచ్చినట్టు ఉంటాయి. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో వాము గింజలు సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు. అసలు వాము గింజలలో ఉండే పోషకాలేంటి? వాటిని ఎలా ఉపయోగిస్తే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది? తెలుసుకుంటే..

Banana: అరటిపండ్లను ఇలా స్టోర్ చేస్తే.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయ్..


తినడానికి కారంగా, ఘాటుగా ఉండే వాము విత్తనాలను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. అయితే వీటిని ఆయుర్వేదంలో కొన్ని రకాల సమస్యలకు ఔషదంగా కూడా ఉపయోగిస్తారు. వాము గింజలలో ప్రోటీన్, ఫైబర్, కొవ్వు, ఫాస్పరస్, నికోటినిక్ యాసిడ్ తో పాటు యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాములో ఉండే లుటియోలిన్, 3-ఎన్-బ్యూటిల్పలైడ్స్ , బీటా-సెల్లినిన్ అని పిలువబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో, గౌట్ సమస్యకు కారణం అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

తెలంగాణలో ఈ గ్రామాల అందం చూస్తే ఫిదా అవుతారు..


వామును ఎలా వాడాలి?

యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వాము నీటిని తాగితే ఉపశమనం ఉంటుందట. ఇందుకోసం ఒక స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని వడగట్టి తాగాలి. కావాలంటే ఇందులో కాస్త అల్లం కూడా జోడించుకోవచ్చు.

ఇతర ప్రయోజనాలు..

  • వాము నీటిని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య మాత్రమే కాకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

  • ఎసిడిటీ, మలబద్దకం సమస్యతో బాధపడేవారికి వాము నీరు ఔషదంగా పనిచేస్తుంది. వాములో యాంటీస్పాస్మోడిక్, కార్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మలబద్దకం, ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

  • కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా వాము నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ కు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి.

  • వాములో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి..

జుట్టు చిట్లుతోందా.. అసలు కారణాలు ఇవే..

మీ ఆయుష్షును పెంచే 6 రహస్యాలు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 22 , 2024 | 04:52 PM