Share News

DC vs SRH: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. మ్యాచ్ గెలవడమే తరువాయి

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:09 PM

IPL 2025 Toss: సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు మొదలైంది. టాస్ నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్ ఏం డిసైడ్ అయిందో ఇప్పుడు చూద్దాం..

DC vs SRH: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. మ్యాచ్ గెలవడమే తరువాయి
IPL 2025

విశాఖ తీరాన జరుగుతున్న బ్లాక్‌బస్టర్‌ ఫైట్‌లో సన్‌రైజర్స్ జట్టు టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది ఆరెంజ్ ఆర్మీ. దీంతో హోం టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ చేయనుంది. విశాఖ పిచ్‌పై గత మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. కాబట్టి ఇది కూడా హైస్కోరింగ్ మ్యాచ్‌‌లాగే కనిపిస్తోంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ (తేమ) పడుతుందా.. లేదా.. అనేది క్లారిటీ లేదు. ఒకవేళ డ్యూ పడితే మాత్రం బౌలింగ్‌ టీమ్‌కు ఇబ్బందులు తప్పవు. బంతిపై గ్రిప్, కంట్రోల్ దొరకడం కష్టమవుతుంది. ఆ కండీషన్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఎలా బౌలింగ్ చేస్తుందనేది కీలకం. ఫస్ట్ బ్యాటింగ్‌లో బిగ్ టోటల్ సెట్ చేయడంతో పాటు బౌలింగ్ సమయంలో వరుస బ్రేక్ త్రూలు ఇస్తూ పోవాలి. అప్పుడే మ్యాచ్‌పై పట్టు బిగించొచ్చు.


ఇవీ చదవండి:

రోహిత్‌ సంచలన వ్యాఖ్యలు

శరత్‌.. ఓటమితో వీడ్కోలు

నవీన డబుల్‌ ధమాకా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2025 | 03:09 PM