Credit Card Bill: ఈ టిప్స్‌తో మీ రుణభారం.. క్షణాల్లో ఎగిరిపోతుంది
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:10 PM
అప్పుల భారం పెరిగిందా.. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే.. రుణభారం త్వరగా తీర్చుకోవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఈలోకంలో ప్రశాంతమైన జీవితం ఎవరిది అంటే.. అప్పులు లేని వారిది. అప్పు లేని వాడు అసలైన ధనవంతుడు అంటారు పెద్దలు. అయితే నేటి కాలంలో అప్పు చేయకుండా జీవించడం అంటే మాటలు కాదు. ఖర్చులు పెరగడం.. ఆదాయం తగ్గడం వంటి కారణాల వల్ల ప్రతి వ్యక్తి ఏదో ఓ సందర్భంలో అప్పు చేయక తప్పని పరిస్థితి. ప్రతిసారి స్నేహితులు, బంధువుల దగ్గర అప్పు పుట్టాలంటే కష్టం. అందుకే నేటి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతోంది. అయితే క్రెడిట్‌కార్డు వల్ల అసరానికి డబ్బులు బాగానే అందుతాయి కానీ.. వాటిని తీర్చడం మళ్లీ తలకు మించిన భారం అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ చిట్కాలు పాటిస్తే.. రుణభారం త్వరగా తిరిపోతుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు.
క్రెడిట్‌కార్డు బిల్లు ఒకేసారి కట్టడం కష్టం అనుకుంటే.. దాన్ని ఈఎంఐల్లోకి మార్చుకోవడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఇలా చేస్తే.. 12-15 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇక ఈ ఈఎంఐలు కూడా 3-12 నెలల పాటు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అన్ని కొనుగోళ్లకు ఈఎంఐ ఆప్షన్ వర్తించదు.
ఒకేసారి క్రెడిట్‌కార్డు బిల్లు మొత్తం కట్టలేము అనుకుంటే.. ఈఎంఐకి మార్చుకునే అవకాశం ఉంటే వాడుకోవడం ఉత్తమం.
అందులోనే వీలైనన్ని ఎక్కువ వాయిదాలు ఉండేలా నిర్ణయించుకోవాలి.
ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ లేపోతే.. తక్కువ వడ్డీ రుణాలేమైనా లభిస్తాయేమో చూడలి.
హోం లోన్‌కి టాపప్ తీసుకోవచ్చు. లేదంటే పర్సనల్ లోన్ లభిస్తుందేమో చూడండి
మీరు చెల్లించే అప్పుల్లో 15 శాతం, అంతకు మించి వడ్డీ రేటు ఉన్న అప్పులను సాధ్యమైనంత త్వరగా తీర్చేసుకొండి.
క్రెడిట్ కార్డు భారాన్ని తాత్కాలికంగా వదిలించుకునేందుకు ఉన్న మరో మార్గం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటే.. ఉదాహరణకు మీ దగ్గర రెండు, అంతకుమించి క్రెడిట్ కార్డులుంటే.. ఒక కార్డు బాకీని మరో కార్డుకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు 2-6 నెలల పాటు ఆ బాకీని చెల్లించేందుకు వీలుంటుంది.
ఇలా బాకీని బదిలీ చేసుకొనేటప్పుడు ఆయా కార్డు సంస్థలు అందించే ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు చూసి నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఇవి కూడా చదవండి:
అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి..పేలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..