Osmania Hospital: కాలిన గాయాలపై కొత్త చర్మం
ABN , Publish Date - Mar 28 , 2025 | 09:43 AM
నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో కాలిన గాయాలపై కొత్త చర్మం వచ్చేలా చికిత్స అందిస్తున్నారు. ఒక దాత నుంచి సేకరించిన చర్మాన్ని నలుగురు లేదా ఐదుగురు పిల్లలకు స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు.

- స్కిన్ గ్రాఫ్టింగ్‌కు కేరాఫ్‌గా ఉస్మానియా ఆస్పత్రి
- దాతల నుంచి సేకరణ
- స్కిన్ బ్యాంక్‌లో నిల్వ
- చర్మం దానంపై వైద్యుల ప్రచారం
హైదరాబాద్ సిటీ: కాలిన గాయాలతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారులకు బాసటగా నిలుస్తోంది ఉస్మానియా ఆస్పత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ గ్రాఫ్టింగ్‌కు ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటి వరకు 17మంది పిల్లలకు విజయవంతంగా స్కిన్ గ్రాఫ్టింగ్ నిర్వహించి కొత్త జీవితానికి బాటలు వేశారు. దాతల నుంచి సేకరించే చర్మాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన స్కిన్ బ్యాంక్‌లో భద్ర పరుస్తారు. అయిదేళ్ల పాటు ఇక్కడ నిల్వ చేసే సదుపాయం ఉంది.
ఈ వార్తను కూడా చదవండి: Rice: సన్నబియ్యం వచ్చేశాయ్.. వచ్చే నెల నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ
ఒకరి నుంచి సేకరిస్తే అయిదుగురికి..
ఒక దాత నుంచి సేకరించిన చర్మాన్ని నలుగురు లేదా ఐదుగురు పిల్లలకు స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. 2 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉండే చిన్నారులకు 50 శాతం వరకు తీవ్రంగా కాలిన గాయాలకు ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు. పిల్లలలు పెరుగుతున్న కొద్దీ కొత్త చర్మం వస్తుంది. అయితే, బయటి నుంచి ఇన్‌ఫెక్షన్ రాకుండా.. లోపల కొత్త చర్మం వచ్చేంత వరకు రక్షణగా ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ ఉం టుంది. కొత్త చర్మం వచ్చిన తర్వాత దానంతట అదే స్కిన్ గ్రాఫ్టింగ్ చేసిన చర్మం ఊడిపోతుంది.
ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే..
చర్మ దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని వైద్యులు పిలుపునిస్తున్నారు. ఆసక్తి గల దాతలు +91 40-24600146 నంబర్‌కు ఫోన్ చేసి ఎక్స్‌టెన్షన్ ఏబీసీ వార్డుకు కనెక్షన్ ఇవ్వాని కోరితే ఇస్తారు. అక్కడ దాతల వివరాలు, సమాచారం అందిస్తే వారు నమోదు చేసుకుని వైద్య బృందం ఇంటికి వచ్చి చర్మాన్ని సేకరిస్తారు.
దాత ఎవరైనా ఉండొచ్చు
చర్మం దానం చేయడానికి మీకు ఆసక్తి ఉన్నా, తెలిసిన వారు ఎవరైనా ఉన్నా ఉస్మానియా ఆస్పత్రిలోని స్కిన్ బ్యాంక్‌కు ఫోన్ చేస్తే చాలు.. ప్లాస్టిక్ సర్జన్ వైద్య బృందం వచ్చి చర్మం సేకరిస్తారు. చనిపోయిన వారి నుంచి కూడా ఈ సేకరణ ఉంటుంది. ఆ తర్వాత డ్రెసింగ్ చేసి ఇస్తారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటీ వరకు కేవలం బ్రెయిన్ డెడ్ అయిన బాధితుల నుంచే చర్మం సేకరిస్తున్నాం. కంటి దానం మాదిరిగానే చర్మం దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాలు, ఇతర సమయాల్లో చనిపోతున్న వారి చర్మాన్ని దానం చేయవచ్చు. 60 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న వారి చర్మం కూడా సేకరిస్తాం. దాతలకు స్కిన్ క్యాన్సర్, స్కిన్ ఇన్‌ఫెక్షన్, హెచ్‌ఐవి ఉండకూడదు. దాతల నుంచి చర్మాన్ని జీవన్‌దాన్ ద్వారానే చేస్తున్నాం.
-డాక్టర్ పలుకూరి లక్ష్మి, ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి, ఉస్మానియా ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News