Diabetes in Women: డయాబెటిస్ ముప్పు! మహిళల్లో కనిపించే ప్రత్యేక రోగ లక్షణాలు ఇవే!
ABN , Publish Date - Nov 30 , 2024 | 09:52 PM
అయితే, మహిళలకున్న ప్రత్యేక హార్మోన్ల వ్యవస్థ, శరీరం తీరుతెన్నల కారణంగా వారిలో షుగర్ వ్యాధికి సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలు కనబడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు బయటపడిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే డయాబెటిస్ కట్టుతప్పకుండా చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, మహిళలకున్న ప్రత్యేక హార్మోన్ల వ్యవస్థ, శరీరం తీరుతెన్నుల కారణంగా వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనబడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు బయటపడిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే డయాబెటిస్ కట్టుతప్పకుండా చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. మరి ఈ ప్రత్యేక రోగ లక్షణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే యీస్ట్ అనే సూక్ష్మక్రిమి కారణంగా తరచూ వెజైనల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిగత భాగంలో దురదతో పాటు వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుందని, డిశ్చార్జ్ తెల్లటి రంగులో చిక్కగా అవుతుందని చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా యాంటీఫంగల్ ఔషధాలను తీసుకోవాలి. అంతే కాకుండా, బ్రీతబుల్ కాటన్ అండర్‌వేర్లు వాడితే దురదల నుంచి చాలా వరకూ ఉపశమనం లభిస్తుంది.
Curd: ఈ విషయాలు తెలిస్తే ఇక ఎన్నడూ పెరుగు లేకుండా భోజనం ముగించరు!
డయాబెటిస్ కారణంగా మహిళల్లో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తరచూ మూత్రవిసర్జన చేయాల్సి రావడం, మూత్రం రంగు మారడం, మంట సమస్యలు వస్తాయి. బాగా నీరు తాగితే ఈ సమస్య నుంచి చాలా వరకూ ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెంటనే యాంటీబయాటిక్ ట్రీట్‌మెంట్ మొదలెడితే పరిస్థితి అదుపు తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు.
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్న వారిలో కూడా ఇన్సులీన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ మొదలపువుతంది. ఇలాంటి వారిలో పీరియడ్స్ క్రమం తప్పడం. ముఖంతో పాటు ఇతర భాగాల్లో వెంట్రుకలు పెరగడం, అధికంగా బరువు పెరగడం వంటివి తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్లు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేయడం, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తినడం చేస్తే ఉపశనమం కలుగుతుంది. డయాబెటిస్ ఉన్న మహిళలు తమకు పీసీఓఎస్ ఉందేమో చెక్ చేసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Mosquito Repellent: మస్కిటో రిపెలెంట్స్ హానికరమా? వైద్యులు చెప్పిన సమాధానం ఇదే!
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ బారిన పడ్డ వారికి భవిష్యత్తులో షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కడుపుతో ఉన్నప్పుడూ ఆ తరువాత చక్కెర స్థాయిలపై ఓ కన్నేసి ఉంచితే సమస్య ప్రారంభంలోనే గుర్తించి తగు చర్యలు తీసుకోవచ్చు.
ఇక అధిక చక్కెర స్థాయి కారణంగా రక్తనాణాలు కూడా దెబ్బతింటాయని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా వ్యక్తిగత భాగానికి రక్తప్రసరణ తగ్గి తడిఆరిపోయినట్టు ఉండటం, కలయిక సమయంలో నొప్పి, లైంగికాసక్తి తగ్గడం వంటివి చోటుచేసుకుంటాయి. కాబట్టి, నిత్యం షుగర్ కంట్రోల్‌లో ఉందో చెక్ చేసుకుంటూ ఉండాలని, సమస్యల గురించి భాగస్వామితో కూడా చర్చించి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.