ISRO: ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ దిశగా ఇస్రో
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:21 AM
ఇస్రో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను పరీక్షించి 300 మిల్లీన్యూటన్ల సామర్థ్యం, 1000 గంటల జీవితకాలంతో విజయం సాధించింది. ఇది ఉపగ్రహాల బరువు తగ్గించే అవకాశాన్ని తెరవవచ్చు

న్యూఢిల్లీ, మార్చి 29: ఉపగ్రహ ప్రయోగాల్లో కొత్త శకాన్ని ప్రారంభించే ‘ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్’ సాకారం దిశగా ఇస్రో మరో ముందడుగు వేసింది. 300 మిల్లీన్యూటన్ల సామర్థ్యమున్న స్టేషనరీ ప్లాస్మా థ్రస్టర్ వెయ్యి గంటల జీవితకాలాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది. సదరు థ్రస్టర్‌ను ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో వినియోగించనున్నారు. ప్రస్తుతం ఉపగ్రహాలను ఒక కక్ష్యలో స్థిరంగా ఉంచటానికి, ఒక కక్ష్య నుంచి మరొక కక్ష్యలోకి పంపించటానికి ‘రసాయనిక ప్రొపల్షన్ వ్యవస్థలను’ వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను వాడే అవకాశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ఫలిస్తే.. ఉపగ్రహాల బరువు తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News