Musk Sells X to XAI for $33B: ఎక్స్‌ను ఎక్స్‌ఏఐకు అమ్మిన మస్క్
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:02 AM
ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌ను 33 బిలియన్ డాలర్లకు కృత్రిమమేధ సంస్థ ఎక్స్‌ఏఐకి విక్రయించారు. ఈ డీల్‌తో ఎక్స్‌ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లుగా పెరిగింది

వాషింగ్టన్, మార్చి 29: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ను అమ్మేశారు. అయితే కొన్న సంస్థ కూడా ఆయనకు చెందినదే కావడం విశేషం. ఎక్స్‌ను కృత్రిమమేధ సంస్థ ఎక్స్‌ఏఐకు 33 బిలియన్ డాలర్లకు విక్రయించినట్లు మస్క్ ప్రకటించారు. ఎక్స్‌కు ఉన్న విశేష ఆదరణతో ఎక్స్‌ఏఐ అధునాతన శక్తిని, నైపుణ్యాన్ని సమ్మిళితం చేయడం ద్వారా అపారమైన సామర్థ్యాన్ని అందుకునే అవకాశం ఉందని ఆ పోస్టులో మస్క్ తెలిపారు. ఈ డీల్‌తో ఎక్స్‌ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లుగా, ఎక్స్ విలువ 33 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు. 2022లో ట్విటర్‌ను కొని దానిని ఎక్స్‌గా మార్చిన మస్క్.. ఏడాది తర్వాత ఎక్స్‌ఏఐను స్థాపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News