Share News

Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే త్వరపడండి..

ABN , Publish Date - Mar 30 , 2025 | 06:46 AM

కొన్ని నెలలుగా బంగారం ధర పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పసిడి ధర స్వల్ప ఊరటనిచ్చింది. మరింత పెరగకుండా స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది.

Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే త్వరపడండి..

బిజినెస్ న్యూస్: బంగారం ధరను అంతర్జాతీయ మార్కెట్లు సహా వివిధ అంశాలు ప్రభావితం చేసే సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఇవాళ (30-03-2025) స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,583 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.89,000కు చేరింది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.81,730 కాగా.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.89,160గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలో పెద్దగా మార్పులేమీ లేవు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,858 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.89,300 వద్ద కొనసాగుతోంది.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధర పరిస్థితి ఎలా ఉందంటే..

  • చెన్నై- రూ.81,968, రూ.89,420

  • బెంగళూరు- రూ.81,794, రూ.89,230

  • అహ్మదాబాద్- రూ.81,840, రూ.89,280

  • భువనేశ్వర్- రూ.81,748, రూ.89,180

  • పుణె- రూ.81,730, రూ.89,160

  • భోపాల్- రూ.81,813, రూ.89,250

  • కోల్‌కతా- రూ.81,620, రూ.89,040

  • కోయంబత్తూర్- రూ.81,968, రూ.89,420

  • పట్నా- రూ.81,684, రూ.89,110

  • సూరత్- రూ.81,840, రూ.89,280


వెండి ధర ఎలా ఉందంటే..

మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధర సైతం స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది. ఢిల్లీలో ఆదివారం ఉదయం 06:30 గంటల సమయానికి కిలో వెండి ధర రూ.1,00,400 ఉండగా.. ముంబైలో రూ.1,00,580 వద్ద కొనసాగుతోంది. ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కేజీ వెండి ధర రూ.1,00,740కి చేరింది.


ఈ వార్తలు కూడా చదవండి:

30, 40, 50 ఏళ్లలో రిటైర్మెంట్‌ ప్రణాళిక ఇలా..

కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక పన్ను మార్పులు..

Updated Date - Mar 30 , 2025 | 06:50 AM