Film Star: 26 ఏళ్లకే ఫిల్మ్ స్టార్ మృతి.. అసలేమైంది? | 26 years film star Sophia Leone passed away at america sri
Share News

Film Star: 26 ఏళ్లకే ఫిల్మ్ స్టార్ మృతి.. అసలేమైంది?

ABN , Publish Date - Mar 10 , 2024 | 08:33 AM

ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్(26) మృత్యువాత చెందారు. ఈ విషయాన్ని నటి సవతి తండ్రి మైక్ రొమెరో ధృవీకరించారు. అయితే ఈ నటి ఎలా చనిపోయింది. ఎందుకు చనిపోయిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Film Star: 26 ఏళ్లకే ఫిల్మ్ స్టార్ మృతి.. అసలేమైంది?

ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్(26)(Sophia Leone) మృత్యువాత చెందారు. ఈ విషయాన్ని నటి సవతి తండ్రి మైక్ రొమెరో(Mike Romero) ధృవీకరించారు. అయితే ఈ నటి ఎలా చనిపోయింది. ఎందుకు చనిపోయిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే సోఫియాను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదని మైక్ రొమెరో తెలిపారు. ఆ క్రమంలోనే వారం క్రితం మార్చి 1న అమెరికా(america)లోని తన అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో కనిపించిందని మైక్ రొమెరో అన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులకు(police) విషయం తెలిపామని ప్రస్తుతం మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. మరోవైపు గత మూడు నెలల్లో ఇది నాల్గవ అడల్ట్ స్టార్ మరణం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు కాగ్నీ లీ కేవలం 36 వయస్సులోనే మరణించింది. అంతకు ముందు జనవరిలో జెస్సీ జేన్ ఓక్లహోమాలో తన ప్రియుడు బ్రెట్ హాసెన్‌ముల్లర్‌తో కలిసి మరణించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

గత వారం సోఫియా సోషల్ మీడియా(social media)లో చాలా యాక్టివ్‌గా ఉంది. కొన్ని పోస్ట్‌లు కూడా చేసింది. ఫిల్మ్ స్టార్ ఎమిలీ విల్లీస్ ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత ఇది జరిగింది. సోఫియా సవతి తండ్రి మైక్ రొమెరో GoFundMeలో ఈ ఘటన గురించి సమాచారాన్ని పోస్ట్ చేశారు. అంత్యక్రియల కోసం డబ్బు సేకరిస్తున్నట్లు ప్రస్తుతం ఈ అంశం విచారణలో ఉందని శనివారం వెల్లడించారు. ఇది తెలిసిన సోఫియా స్నేహితులు, అభిమానులు షాక్ అవుతున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Miss World 2024: మిస్ వరల్డ్ 2024 కిరీటం గెల్చుకున్న క్రిస్టినా పిస్కోవా

Updated Date - Mar 11 , 2024 | 05:00 PM