Share News

PAK vs SA: గ్రౌండ్‌లో పొల్లు పొల్లు తిట్టుకున్న ప్లేయర్లు.. పాక్ పరువు తీశారు

ABN , Publish Date - Dec 26 , 2024 | 08:26 PM

Kamran Ghulam: పాకిస్థాన్ పరువు మళ్లీ పోయింది. ఆ జట్టు ఇజ్జత్ ఇతరులు తీయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే తీసుకుంటారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇది ఇంకోసారి రిపీట్ అయింది.

PAK vs SA: గ్రౌండ్‌లో పొల్లు పొల్లు తిట్టుకున్న ప్లేయర్లు.. పాక్ పరువు తీశారు
Kamran Ghulam

క్రికెట్‌లో అన్ని జట్లది ఒక లెక్కయితే.. పాకిస్థాన్‌ది మరో లెక్క. ఆటలోనే కాదు.. వ్యవహార శైలిలోనూ ఆ టీమ్ ఎవరికీ అంతుపట్టదు. ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు. వాళ్లలోనే వాళ్లు గొడవ పడి జట్టు పరువు తీసిన సందర్భాలు కూడా బోలెడు. పెద్దగా ఇతర టీమ్స్ జోలికి వెళ్లని పాక్ ప్లేయర్లు.. తాజాగా ఆ పని కూడా చేసి తమ పరువు తామే తీసుకున్నారు. పాకిస్థాన్ పరువు ఇతరులు తీయాల్సిన పనిలేదు.. తామే ఇజ్జత్ తీస్తామన్నట్లుగా ప్రవర్తించారు. అసలేం జరిగింది? పాక్ ప్లేయర్ చేసిన తప్పేంటి? ఏ మ్యాచ్‌లో ఇది జరిగింది? లాంటి వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం..


దమ్ముంటే అనమంటూ..

క్రికెట్‌లో స్లెడ్జింగ్ సర్వసాధారణమే. కానీ అది పాకిస్థాన్ వాళ్లు చేస్తే నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ఆ జట్టు బ్యాటర్ కమ్రాన్ గులాం ఓవరాక్షన్‌తో పాక్ పరువు తీశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో నోటిదూలతో వివాదాల్లోకి ఎక్కాడు. ప్రొటీస్ స్టార్ బౌలర్ కగిసో రబాడతో పాటు యంగ్ ప్లేయర్ వెర్రీన్‌తో గొడవకు దిగాడు కమ్రాన్. అసభ్యకర పదజాలంతో వాళ్లిద్దర్నీ దూషించాడు. రబాడ అతడ్ని లైట్‌గా తీసుకున్నాడు. కానీ వెర్రీన్ మాత్రం వదిలిపెట్టలేదు. ఏం అన్నావంటూ పాక్ బ్యాటర్ మీదికి దూసుకొచ్చాడు. దమ్ముంటే.. ఇప్పుడు ఆ మాట అను చూద్దామంటూ అతడికి సవాల్ విసిరాడు.


బూతులతో..

వెర్రీన్ రెచ్చగొట్టడంతో క్రమాన్ గులాం మరింత ఓవరాక్షన్ చేశాడు. అసభ్య పదజాలాన్ని మళ్లీ రిపీట్ చేశాడు. ఏం అన్నావంటూ మళ్లీ అతడి మీద ఫైర్ అయ్యాడు సౌతాఫ్రికా క్రికెటర్. దీంతో వెళ్లు అంటూ గులాం అనగా.. వెర్రీన్ ఏదో కామెంట్ చేస్తూ తన ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఆటలో తిట్టుకోవడాలు కామన్ అని.. కానీ మరీ ఇంతలా బూతులు మాట్లాడటం ఏంటంటూ పాక్ ప్లేయర్‌పై సీరియస్ అవుతున్నారు. పాక్ పరువు తీశాడని.. టాప్ టీమ్‌తో ఆడుతున్నప్పుడు ఇలాగేనా బిహేవ్ చేసేదని దుయ్యబడుతున్నారు. టెస్టుల్లో నంబర్ 7లో ఉన్న టీమ్.. ఇంత బిల్డప్ అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. బూతులు మాట్లాడుతూ జెంటిల్మన్ గేమ్‌కు అప్రతిష్ట తీసుకురావొద్దంటూ చీవాట్లు పెడుతున్నారు.


Also Read:

బుమ్రా దెబ్బకు హెడ్‌కు మైండ్‌బ్లాంక్.. ఇది చూసి తీరాల్సిన వికెట్

అందర్నీ భయపెట్టే బుమ్రానే వణికించాడు.. ఎవరీ కోన్స్టాస్..

జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్.. గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అంటూ..

తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్

For More Sports And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 08:32 PM