Share News

Viral Videos: కజకిస్థాన్ విమాన ప్రమాదానికి ముందు.. తర్వాత వీడియోలు చుశారా..

ABN , Publish Date - Dec 26 , 2024 | 08:14 AM

దాదాపు 67 మంది వ్యక్తులతో బాకు నుంచి గ్రోజ్నీకి వెళ్తున్న ప్రయాణీకుల విమానం కజకిస్థాన్‌లో ఇటివల కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి ముందు విమానంలో ఉన్న ప్రయాణికుల దృశ్యాలు, ఆ తర్వాత వీడియో వెలుగులోకి వచ్చింది. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Viral Videos: కజకిస్థాన్ విమాన ప్రమాదానికి ముందు.. తర్వాత వీడియోలు చుశారా..
Kazakhstan Plane Crash videos

కజకిస్థాన్‌(Kazakhstan)లో ఇటివల విమానం కూలిపోయిన ఘటనలో 38 మంది చనిపోయారు. కాస్పియన్ సముద్రం తూర్పు తీరంలో చమురు, గ్యాస్ హబ్ అయిన అక్టౌ సమీపంలో ఈ విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం తర్వాత విమానం క్యాబిన్ లోపల రికార్డైన ఒక కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. విమానంలో కూర్చున్న ఓ ప్రయాణికుడు తీసిన వీడియోను (Viral Videos) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ప్రయాణికుల చివరి క్షణాలు కనిపించాయి.


ఓ ప్రయాణీకుడు మాత్రం..

వీడియోలో విమానం ప్రమాదానికి ముందు ఓ ప్రయాణీకుడు "అల్లాహు అక్బర్" అంటూ చెబుతున్నట్లు వినిపించింది. ఆ క్రమంలో ఆక్సిజన్ మాస్క్‌లు సీట్లకు వేలాడుతూ కనిపించాయి. డోర్‌బెల్ లాంటి శబ్దం మధ్య అరుపులు, ఏడుపులు వినిపించాయి. క్యాబిన్ లోపల తీసిన మరో వీడియోలో రీడింగ్ లైట్, ఎయిర్ బ్లోవర్ తలక్రిందులుగా ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ రూఫ్ ప్యానెల్, సహాయం కోసం ప్రయాణికులు అరుస్తున్నట్లు కనిపించింది. అంతేకాదు ఈ విమానం కూలిపోయిన తర్వాత కూడా ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఫ్లైట్ క్రమంగా కిందకు పడి దగ్ధమయిన దశ్యాలు కనిపిస్తున్నాయి.


అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌లో ఎవరు ఉన్నారు

కజకిస్థాన్‌లోని అక్టౌ విమానాశ్రయానికి సమీపంలో J2-8243 విమానం కూలిపోయింది. కజకిస్థాన్‌లోని మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (MES) 28 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలిపింది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో సహా 67 మంది ఉన్నారు. విమానంలోని ప్రయాణికుల్లో అజర్‌బైజాన్‌కు చెందిన 37 మంది, రష్యాకు చెందిన 16 మంది, కజకిస్థాన్‌కు చెందిన ఆరుగురు, కిర్గిస్థాన్‌కు చెందిన ముగ్గురు పౌరులు ఉన్నారని కజకిస్తాన్ మీడియా తెలిపింది.


కారణమిదేనా..

విమానాన్ని పక్షి ఢీకొనడమే ఈ విషాదానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. MES విమానంలో మంటలు చెలరేగిన ప్రదేశానికి 52 మంది సిబ్బంది, 11 యూనిట్ల పరికరాలను పంపించారు. ఎంబ్రేయర్ 190 ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్ కాన్ఫిగరేషన్‌ను బట్టి 96 నుంచి 114 మంది ప్రయాణికులను కలిగి ఉంటుంది. ఈ విమానం 4,500 కి.మీ. FlightAware ప్రకారం విమానం షెడ్యూల్ కంటే 11 నిమిషాల ముందు బయలుదేరింది. ఇది కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు అత్యవసర సంకేతాన్ని జారీ చేశారు.


ప్రమాదం ఎందుకు జరిగింది?

పొగమంచు కారణంగా విమానాన్ని గ్రోజ్నీలో ల్యాండ్ చేయడానికి అనుమతించలేదని అజర్బైజాన్ మీడియా పేర్కొంది. ఈ కారణంగా అది మఖచ్కాలాకు మళ్లించబడింది. తరువాత అక్టౌకు మళ్లించారు. ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ యాప్‌లు విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతున్నట్లు చూపించాయి. విమానం రష్యా ప్రాదేశిక పరిమితుల్లోకి ప్రవేశించిన వెంటనే విమానాశ్రయం సమీపంలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.28 గంటలకు ఎయిర్‌పోర్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయింది.


ఇవి కూడా చదవండి:

Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..


Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More International News and Latest Telugu News

Updated Date - Dec 26 , 2024 | 08:20 AM