Share News

Satellites Collide: అంతరిక్షంలో తప్పిన భారీ ప్రమాదం.. రెండు శాటిలైట్స్ అత్యంత సమీపానికొచ్చి..

ABN , Publish Date - Feb 29 , 2024 | 08:54 PM

మన భూమిపై ఎలాగైతే వాహనాల సంఖ్య పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో.. సరిగ్గా అలాంటి పరిస్థితులే ఆకాశంలోనూ నెలకొన్నాయి. శాటిలైట్స్ (Satellites) పుణ్యమా అని.. అంతరిక్షంలోనూ ట్రాఫిక్ లాంటి సిచ్యుయేషనే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. రెండు అగ్రరాజ్యాలకు సంబంధించిన శాటిలైట్స్ అత్యంత సమీపానికి వచ్చాయి. దాదాపు అవి ఢీకొట్టుకుంటాయని శాస్త్రవేత్తలు భయపడ్డారు.

Satellites Collide: అంతరిక్షంలో తప్పిన భారీ ప్రమాదం.. రెండు శాటిలైట్స్ అత్యంత సమీపానికొచ్చి..

మన భూమిపై ఎలాగైతే వాహనాల సంఖ్య పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో.. సరిగ్గా అలాంటి పరిస్థితులే ఆకాశంలోనూ నెలకొన్నాయి. శాటిలైట్స్ (Satellites) పుణ్యమా అని.. అంతరిక్షంలోనూ ట్రాఫిక్ లాంటి సిచ్యుయేషనే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. రెండు అగ్రరాజ్యాలకు సంబంధించిన శాటిలైట్స్ అత్యంత సమీపానికి వచ్చాయి. దాదాపు అవి ఢీకొట్టుకుంటాయని శాస్త్రవేత్తలు భయపడ్డారు. కానీ.. అదృష్టవశాత్తూ అవి కొంత దూరంలో తప్పించుకున్నాయి. దీంతో.. అంతరిక్షంలో భారీ ప్రమాదం తప్పింది. ఒకవేళ ఇవి ఢీకొట్టుకొని ఉంటే, పెను విధ్వంసమే సంభవించేది. అయితే.. అలా జరగకపోవడంతో సైంటిస్టులు ఊపీరి పీల్చుకున్నారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.


అమెరికా (America), రష్యాకు (Russia) చెందిన రెండు శాటిలైట్స్ ఫేస్ టు ఫేస్ వచ్చాయి. అవి దాదాపు ఢీకొట్టుకోవచ్చని అందరూ భయపడ్డారు కానీ, కేవలం 20 మీటర్ల దూరంలో తాకిడి తప్పింది. ఒక శాటిలైట్ నాసాకు చెందిన థర్మోస్పియర్ అయానోస్పియర్ మెసోస్పియర్ ఎనర్జిటిక్స్ అండ్ డైనమిక్స్ మిషన్ (TIMED) కాగా.. మరొకటి రష్యన్ కాస్మోస్ 2221 (Russian Cosmos 2221) ఉపగ్రహం. ఈ రెండింటిలో TIMED శాటిలైట్ ఇంకా పని చేస్తూనే ఉంది కానీ, రష్యన్ శాటిలైట్ మాత్రం పనిచేయడం లేదు. 2530 కిలోగ్రాముల బరువున్న ఈ రెండు ఉపగ్రహాలు.. అత్యంత సమీపానికి వచ్చినప్పుడు గంటకు 50,400 కిలోమీటర్ల వేగంలో ఉన్నాయి. ఒకవేళ ఇవి ఢీకొట్టుకొని ఉండుంటే.. భారీ విధ్వంసమే జరిగి ఉండేది, దాంతో అంతరిక్షలో లెక్కలేనన్ని వ్యర్థ శిధిలాలు ఏర్పడి ఉండేవని సైంటిస్టులు చెప్తున్నారు.

ఈ అంతరిక్ష నౌకల ద్రవ్యరాశి, నిర్మాణం, వేగాన్ని బట్టి చూస్తే.. ప్రమాదం సంభవించి ఉంటే 2000 రెంచి 7000 దాకా శకలాలు ఏర్పడి ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ.. అదృష్టవశాత్తూ కొంత దూరం నుంచి తప్పుకోవడంతో ఆ ప్రమాదం సంభవించలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇవి మళ్లీ ఒకదానికొకటి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. కాగా.. అంతరిక్షంలో రెండు శాటిలైట్స్ ముఖాముఖిగా రావడం ఇదే మొదటిసారి కాదు. భూమి చుట్టూ కొన్ని వేలాది ఉపగ్రహాలు ఉన్నాయి. అవి కొన్నిసార్లు ఒకదానితో మరొకటి ఢీకొనే మార్గంలో పయనిస్తుంటాయి. అప్పుడు స్పేస్ ఏజెన్సీలు ఢీకొనే ప్రమాదాన్ని నివారించేందుకు.. కొన్ని మార్పులు (ఆల్టిట్యూడ్, వేగం) చేస్తాయి.

Updated Date - Feb 29 , 2024 | 08:54 PM