Share News

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి షాకిచ్చిన శృంగార తార.. ఆరోజు హోటల్ రూమ్‌లో..

ABN , Publish Date - May 08 , 2024 | 07:36 PM

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు ‘హష్ మనీ’ కేసులో కోలుకోలేని షాక్..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి షాకిచ్చిన శృంగార తార.. ఆరోజు హోటల్ రూమ్‌లో..

రెండోసారి అమెరికా (America) అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు ‘హష్ మనీ’ కేసులో కోలుకోలేని షాక్ తగిలింది. తాను ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని, ఓ హోటల్ రూమ్‌లో ఆయనతో శృంగారంలో పాల్గొన్నానని ఆమె కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు ఆమె న్యూయార్క్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు గాను, తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారని బాంబ్ పేల్చింది. దీంతో.. ఈ కేసులో ట్రంప్ అరెస్ట్ అవ్వొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.


మరీ ఇంత నీచమా.. వివాహేతర సంబంధం కోసం కూతురిని..

అసలు మేటర్ ఏమిటంటే.. స్టార్మీ డేనియల్ అనే శృంగార తార గతంలో తనకు డొనాల్డ్ ట్రంప్‌తో లైంగిక సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. అయితే.. ఈ విషయం బయటపడితే 2016 ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో.. ఆ విషయం బయటకు పొక్కనీయకుండా ట్రంప్ తనని ప్రలోభపెట్టారని ఆమె ఆరోపణలు చేసింది. ఈ కేసు విచారణ న్యూయార్క్ కోర్టులో జరుగుతుండగా.. తాజాగా ఆమె ఓ సంచలన వాంగ్మూలం ఇచ్చింది. 2006లో జరిగిన ఓ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో భాగంగా తాను ట్రంప్‌ని తొలిసారి కలిశానని, ఆ సమయంలో ఓ బాడీగార్డ్ ద్వారా తనని డిన్నర్‌కు ఆహ్వానించారని స్టార్మీ తెలిపింది. డిన్నర్ ముగిశాక ట్రంప్ తనని హోటల్ సూట్‌కు తీసుకెళ్లారని.. అక్కడ తామిద్దరం శృంగారంలో పాల్గొన్నామని వెల్లడించింది. ఆ తర్వాత తామిద్దరం పలుమార్లు భేటీ అయినా, శృంగారంలో మాత్రం పాల్గొనలేదని పేర్కొంది.

ఈనెల 11న కడపకు రాహుల్ గాంధీ.. ఎందుకంటే?

తమ మధ్య లైంగిక సంబంధం ఉందన్న విషయం 2011లో ఓ బ్లాగ్ ద్వారా బయటకు వచ్చిందని స్టార్మీ డేనియర్ చెప్పింది. అయితే.. 2016 ఎన్నికల టైంలో తన నోరు మూయించడం కోసం ట్రంప్ ప్రలోభపెట్టారని.. తన న్యాయవాది ద్వారా ఆయన 1.30 లక్షల డాలర్లను పంపించారని.. ఆ డబ్బుని తాను స్వీకరించానని చెప్పుకొచ్చింది. మరోవైపు.. ట్రంప్ తరఫు న్యాయవాదులు మాత్రం ఆమె వాదనల్ని తోసిపుచ్చారు. కేవలం డబ్బుల కోసమే స్టార్మీ ఈ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు. కాగా.. ఆమె ఈ వాంగ్మూలం ఇస్తున్న సమయంలో ట్రంప్ కోర్టులోనే ఉన్నారు.

Read Latest International News and Telugu News

Updated Date - May 08 , 2024 | 07:36 PM