Viral News: ఛీ.. టీచరై ఉండి ఇవేం పాడుపనులు.. ఇద్దరు విద్యార్థులతో..
ABN , Publish Date - May 08 , 2024 | 06:20 PM
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని సన్మార్గంలో నడిపించడమే ఉపాధ్యాయుల ధర్మం. కానీ.. ఈరోజుల్లో కొందరు టీచర్లే దారి తప్పుతున్నారు. తాము పాఠాలు చెప్పే విద్యార్థులనే లోబరచుకొని, తమ లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి పాడుపనే...
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని సన్మార్గంలో నడిపించడమే ఉపాధ్యాయుల ధర్మం. కానీ.. ఈరోజుల్లో కొందరు టీచర్లే దారి తప్పుతున్నారు. తాము పాఠాలు చెప్పే విద్యార్థులనే లోబరచుకొని, తమ లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి పాడుపనే ఓ ఉపాధ్యాయురాలు రెండుసార్లు చేసింది. తొలుత ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఆమె.. ఆ కేసులో జైలుకి వెళ్లొచ్చిన తర్వాత మరో యువకుడితో సంబంధం పెట్టుకుంది. అతనితో శృంగార కార్యకలాపాల్లో పాల్గొని గర్భం కూడా దాల్చింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో.. ఆ టీచరమ్మ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
మరీ ఇంత నీచమా.. వివాహేతర సంబంధం కోసం కూతురిని..
ఆమె పేరు రెబెకా జాయ్‌నెస్ (Rebecca Joynes). ఆమె బయసు 30 సంవత్సరాలు. బ్రిటన్‌లో (Britain) లెక్కల టీచర్‌గా ఆమె పని చేస్తోంది. కట్ చేస్తే.. 2021లో రెబెకా ఓ బాలుడికి లెక్కల్లో అదనపు తరగతులు తీసుకుంది. ఈ క్రమంలోనే వాళ్లిద్దరు దగ్గరయ్యారు. తొలుత మెసేజ్‌లతో ఏర్పడిన వీరి బంధం.. క్రమంగా బలపడుతూ వచ్చింది. ఒకరోజు రెబెకా ఆ అబ్బాయిని షాపింగ్‌కి తీసుకెళ్లి.. ఖరీదైన గూచీ బెల్ట్ కొనిచ్చింది. ఆ తర్వాత అతడిని ఒక అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి, అక్కడ తన లైంగిక వాంఛ తీర్చుకుంది. అయితే.. ఈ విషయాన్ని ఆ బాలుడు తన స్నేహితుడితో పంచుకున్నాడు. అక్కడి నుంచి ఈ విషయం చక్కర్లు కొడుతూ.. చివరికి పోలీసుల దాకా వెళ్లింది. దీంతో.. తనకంటే చిన్నవాడైన స్టూడెంట్‌తో సంబంధం పెట్టుకుందన్న నేరంలో రెబెకా అరెస్ట్ అయ్యింది.
ఈనెల 11న కడపకు రాహుల్ గాంధీ.. ఎందుకంటే?
అప్పటికీ ఆ టీచరమ్మ బుద్ధి మారలేదు. ఆ కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన వెంటనే ఆమె మరో బాలుడితో సంబంధం పెట్టుకుంది. అతడు స్నాప్‌చాట్‌లో పరిచయం అవ్వగా.. అతనికి ఫోటోలు పంపి, తన ముగ్గులోకి దింపింది. ఆ అబ్బాయి తనకు ఆకర్షితుడైనప్పటి నుంచి అతనితో కామవాంఛ తీర్చుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఈ వ్యవహారం బయటపడంతో.. బ్రిటన్‌లో ఈ కేసు సంచలనంగా మారింది. ఓవైపు 15 ఏళ్ల బాలుడితో కోర్కెలు తీర్చుకొని గర్భం దాల్చిందని ప్రాసిక్యూటర్లు చెప్తుంటే.. మరోవైపు తానేం తప్పు చేయలేదని, అతనికి 16 నిండిన తర్వాత తాను సంబంధం పెట్టుకున్నానని రెబెకా చెప్తోంది. తాను చేసిన ఈ పాడుపని వల్ల ఆమె తన ఉద్యోగం కోల్పోయింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది.
Read Latest Viral News and Telugu News