Jay Shah: కనీసం బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలుసా.. జై షాపై తీవ్ర విమర్శలు
ABN , Publish Date - May 04 , 2024 | 08:24 PM
బీసీసీఐ ఛైర్మన్ జై షాపై ఆమ్ ఆద్మీ పార్టీ తారాస్థాయిలో విమర్శలు గుప్పించింది. క్రికెట్ ఎలా ఆడాలో తెలియకపోయినా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో ఉన్న స్థానంలో ఉన్నాడని..
బీసీసీఐ (BCCI) ఛైర్మన్ జై షాపై (Jay Shah) ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) తారాస్థాయిలో విమర్శలు గుప్పించింది. క్రికెట్ (Cricket) ఎలా ఆడాలో తెలియకపోయినా.. బీజేపీ (BJP) అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తనయుడు జై షా బీసీసీఐలో ఉన్న స్థానంలో ఉన్నాడని తూర్పారపట్టింది. కనీసం అతనికి బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలుసా? అంటూ దుయ్యబట్టింది. ఆప్ నేత సంజయ్ సింగ్ ఈ మేరకు విరుచుకుపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి బీజేపీ చేస్తున్న విమర్శలను ఉద్దేశించి.. ఆయన ఈ విధంగా కౌంటర్ ఎటాక్ చేశారు.
కుక్కలకూ ‘ఆధార్’.. దీని వెనకున్న కథేంటో తెలుసా?
‘‘అమిత్ షా కుమారుడైన జై షాకు బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలుసా? అయినా సరే, ఆయన ఇప్పుడు బీసీసీఐలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. క్రికెట్‌లో చక్రం తిప్పుతున్నారు. అటు.. 73 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోవాలని తహతహలాడుతున్నారు. కానీ.. అగ్నివీర్ జవాన్లకు మాత్రం వయసు పరిమితిని 21 ఏళ్లకే కుదించారు. నిజానికి.. ఈ వ్యక్తులు ఘోరమైన పరివారవాదీలు. మోదీ, అమిత్ షా, బీజేపీ నేతలకు తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడం మినహాయిస్తే.. మరో పని లేదు. కానీ.. మేము మాత్రం ఈ దేశం కోసం పని చేస్తున్నాం’’ అని సంజయ్ సింగ్ చెప్పుకొచ్చారు.
హార్దిక్ పాండ్యాకు షాక్.. అతడి స్థానంలో ఆ క్రికెటర్‌ను..
ఇదిలావుండగా.. జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జై షాపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వారసత్వ రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడుతుంటుందని.. మరీ బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఎలా కొనసాగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక అగ్నివీర్ స్కీమ్ ద్వారా సైన్యంలో చేరే యువకుల వయసులు కనిష్టంగా 17 ఏళ్లు, గరిష్టంగా 21 ఏళ్లలోపు ఉండాలన్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలో దేశవ్యాప్తంగా యువకులు ఆందోళనలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
Read Latest National News and Telugu News